గనికి రెండు రిలీజ్ డేట్స్.. వస్తే ఫిబ్రవరి 25 లేదా అప్పుడే!
TeluguStop.com
రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా నిన్నటి వరుకు 2 విడుదల తేదీని ప్రకటించడంతో చాలామంది దర్శక నిర్మాతలు కూడా ఈ విధంగా వారి సినిమాకు రెండు విడుదల తేదీలను ప్రకటిస్తున్నారు.
రాజమౌళి సినిమాని చూసుకొని పవన్ కళ్యాణ్ బీమ్లా నాయక్ సినిమాకి కూడా రెండు విడుదల తేదీలను ప్రకటించారు.
ఈ క్రమంలోనే తాజాగా వరుణ్ తేజ్ నటించిన గని సినిమాకి సైతం 2 విడుదల తేదీలను ప్రకటించారు.
ముందుగా ఈ సినిమాని డిసెంబర్ 24వ తేదీన విడుదల చేయాలని భావించారు అయితే కరోనా కారణం వల్ల ఈ సినిమా విడుదల వాయిదా వేశారు ఈ క్రమంలోనే మార్చి 25 వ తేదీకి విడుదల తేదీని ప్రకటించారు.
అయితే అదే రోజునే రాజమౌళి సినిమా విడుదల కావడంతో మరోసారి ఈ సినిమా విడుదల తేదీని మార్చుకోవాల్సి వచ్చింది.
"""/" /
ఈ క్రమంలోనే వరుణ్ తేజ్ గని సినిమాని ఫిబ్రవరి 25 లేదా మార్చి 4వ తేదీ విడుదల చేయడానికి చిత్ర బృందం సన్నాహాలు ఏర్పాటు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ సినిమాకి కూడా రెండు విడుదల తేదీలను ప్రకటించడంతోఈసారైనా చెప్పిన తేదీలకే విడుదల అవుతుందా లేదంటే మరొకసారి ఈ సినిమా వాయిదా పడుతుందా అని మెగా అభిమానులు సందేహాలను వ్యక్తపరుస్తున్నారు.