యాక్టింగ్ చేయమంటే, ఓవర్ యాక్టింగ్ చేసిన గంగవ్వ… కట్ చేస్తే!

ఓ సాధారణ పల్లెటూరు అవ్వ గంగవ్వ( Gangavva ) ఇపుడు ఏకంగా బిగ్‌బాస్ హౌజులో అడుగు పెట్టిందంటే సాధారణమైన విషయం కాదు.

మై విలేజ్ షో( My Village Show ) అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా పాపులర్ అయిన గంగవ్వ ఆ తరువాత క్రమంలో పలు బుల్లితెర షోలలో నటిస్తూ, అడపా దడపా వెండితెరపై కూడా మెరిసింది.

అలా ఆమెకి పాపులారిటీ రావడంతో కొన్నాళ్ల క్రితం బిగ్‌బాస్ సీజన్ 4 ద్వారా హౌజులోకి అడుగుపెట్టి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇక మరలా ఇన్నాళ్ల తరువాత బిగ్‌బాస్ సీజన్ 8 లో( Bigg Boss 8 ) వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా మరోసారి ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యాన్ని కలిగించింది.

కాగా మొన్న అర్ధరాత్రి బిగ్‌బాస్ హౌజులో గంగవ్వకు హార్ట్ ఎటాక్ రాగా అర్జెంటుగా మెడికల్ టీం హౌజులోకి వెళ్లడంతో కంటెస్టెంట్లు అందరూ షాక్‌కు గురయ్యారు.

"""/" / ఇక తాను చేసిన వ్యాఖ్యలతోనే గంగవ్వ మనస్తాపం చెంది గుండెపోటుకు గురైందేమోనని విష్ణుప్రియ భ్రమచెంది మరింత షాక్‌కు గురైంది.

ఆ తరువాత కాసేపటికి నో, నో… ఆమె ప్రాంక్ చేసింది అని కొందరంటే, అబ్బే, బిగ్‌బాసోడే టాస్క్ ఇచ్చి అలా ఆమెచేత చేయమన్నాడు అని మరికొందరు అన్నారు.

ఏదిఏమైనా గంగవ్వ యాక్టింగ్ చేయమంటే ఓవర్ యాక్టింగ్ చేసి, అందరికీ షాక్ ఇచ్చిందని కొందరు అభిప్రాయపడ్డారు.

"""/" / గతంలో అనారోగ్యం కారణంతోనే ఆమె అర్థంతరంగా బిగ్‌బాస్ సీజన్ 4 నుండి బయటకి వచ్చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

ఆ ఘటన మరవకముందే ఇలా జరగడంతో అందరూ నమ్మేశారు.పైగా ఆమె పండు ముదుసలి.

గేమ్స్, టాస్కులు, పరుగులు గట్రా ఆమె వల్ల కావు! సో, నిజంగానే గుండెపోటు( Heart Attack ) వచ్చిందేమో? అనే వార్తలకు ప్రయారిటీ ఇచ్చేలా చేసింది ఆమె నటన.

ఈ క్రమంలో బిగ్‌బాసే ఓ ప్రోమో రిలీజ్ చేయడం జరిగింది.అది క్లియర్ కట్‌గా అవినాష్,( Avinash ) టేస్టీ తేజ,( Tasty Teja ) గంగవ్వ కలిసి చేసిన ఘోస్ట్ ప్రాంక్ అని వినికిడి.

అంటే గుండెపోటు కాదు, ఒక దెయ్యం పట్టిన లేడీ ఎలా చేస్తుందో అలా ప్రాంక్ సీన్ క్రియేట్ చేయడం అన్నమాట.

ఆమెకు ఎలా నటించాలో కూడా టేస్టీ తేజ నేర్పించాడని సమాచారం.అయితే విషయం తెలుసుకున్న జనాలు మాత్రం సదరు షో మీద దుమ్మెత్తిపోస్తున్నారు.

"""/" / ఒక పండు ముసలిదానిని తీసుకొని ఆమెతో ఇలా వ్యాపారం చేయడం, జంతువులను హింసిసించిన దానికంటే కూడా పెద్ద నేరం అని జనాలు ఫీల్ అవుతున్నారు.

అయితే ఇది ఇక జనాలు మరవక మునిపే యూట్యూబర్, బిగ్ బాస్ ఫేమ్ గంగవ్వపై అటవీశాఖ అధికారులు కేసు నమోదు చేసిన‌ సంగతి విదితమే.

మై విలేజ్ షో యూట్యూబ్ ఛానల్‌లో చిలుకని ఉపయోగించడంపై గంగవ్వ, యూట్యూబర్ రాజుపై, యూట్యూబ్ వ్యాపార ‌ప్రయోజనాల కోసం చిలుకను హింసించారంటూ జంతు‌ సంరక్షణ ‌కార్యకర్త ఆదులాపురం గౌతమ్ ఫిర్యాదు చేయడం జరిగింది.

మరి ఈ తంతు ఎక్కడిదాకా పోతుందో చూడాలి మరి!.