అమ్మాయిలను నగ్నంగా చూపించే కూలింగ్ గ్లాస్.. ఆశపడి కొన్నారో ఇక అంతే?
TeluguStop.com
ఈ కలియుగం ఎన్నో దారుణాలకు, మోసాలకు నిలయం అని ఏ మహానుభావుడు చెప్పాడోగాని, అదేమాదిరి జరుగుతోంది.
ఈ కాలంలో చాలామంది ఈజీ మనీకోసం( Easy Money ) ఆశపడి ఎన్నో దారుణాలకు పాల్పడుతున్నారు.
ఈ క్రమంలో ఎదుటివారి మానప్రాణాలను సైతం హరిస్తున్నారు ఎంతోమంది దుర్మార్గులు.ఓ రకంగా చెప్పాలంటే ఈ భూమిపైన అలాంటివారే ఎక్కువగా జీవిస్తున్నారు.
మనుషుల వీక్ నెస్ ని ఇక్కడ చాలామంది క్యాష్ చేసుకుంటూ లక్షల్లో డబ్బులు కూడబెట్టుకుంటున్నారు.
ఆలోచనలను మంచి విషయాలకు ఉపయోగించకుండా.టెక్నాలజీని వాడుకొని అక్రమంగా డబ్బు ఆర్జిస్తున్నారు.
"""/" /
తాజాగా, అదే కోవకు చెందిన ముఠాను పోలీసులు కటకటాల వెనక్కి నెట్టారు.
వివరాల్లోకి వెళితే, బెంగుళూరుకు చెందిన శివ, కేరళకు చెందిన కుబైర్, చిత్తు, ఈర్షాద్ అనే వ్యక్తులు చెన్నైలోని( Chennai ) కోయంబేడులో నివాసం ఉంటున్నారు.
కష్టపడడానికి ఒల్లొంగక, ఈ నలుగురూ ఈజీగా డబ్బు సంపాదించేందుకు ఓ ప్లాన్ చేసుకున్నారు.
సమ్మర్‌ను ఆసరాగా తీసుకుని కూలింగ్ గ్లాసెస్( Cooling Glasses ) బిజినెస్ స్టార్ట్ చేశారు.
అంతవరకూ బాగానే వుంది.వాటిని అమ్మేవారికి మాత్రం వారు సదరు కూలింగ్ గ్లాస్ పెట్టుకుంటే వారికి నచ్చిన అమ్మాయిలను న్యూడ్‌గా చూడవచ్చని నమ్మించారు.
"""/" /
కట్ చేస్తే, ఆ కూలింగ్ గ్లాస్‌లను సేల్ చేసి లక్షల్లో డబ్బు సంపాదించుకున్నారు.
ఒక్కో కూలింగ్ గ్లాస్ ధర లక్షల్లో విక్రయించినట్టు పోలీసులు తెలిపారు.వీరిపై నిఘా పెట్టిన పోలీసులు కోయంబేడులో ఈ మాయగాళ్లను అరెస్ట్ చేసి, వారి నుంచి రైస్ ఫులింగ్ చేసే సామాగ్రి, గన్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు వారిని కోర్టులో ప్రవేశపెట్టారు.ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
తమ్ముడా.. ఎదురెళ్లి దూకేయ్.. దర్శకుడు పూరీ జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!