భూలోకానికి ఆధార్ కార్డ్‌తో వచ్చిన వినాయకుడు.. ఎక్కడో తెలుసా?

ప్రస్తుతం ఆధార్ కార్డ్ అనేది పత్రి ఒక్కరికి తప్పనిసరి.అది ప్రజల జీవితంలో ఒక భాగమైపోయింది.

ఎక్కడికైనా వెళ్లాలన్నా, ఏదైనా పని జరగాలన్నా ఆధార్ కార్డ్ అనేది తప్పనిసరి.కొన్ని కొన్ని సందర్భాలలో ఆధార్ లేకుంటే మనకు ఎక్కడికీ ఎంట్రీ కూడా ఉండటంలేదు.

అందుకే ఏ వ్యక్తి అయినా సరే తమ పర్స్‌లో పైసల్ లేకున్నా మంచిదే కానీ ఆధార్ కార్డ్ మాత్రం తప్పని సరిగా పెట్టుకుంటున్నారు.

అయితే భూలోకానికి వచ్చిన వినాయకుడికి ఎవరు చెప్పారో మరీ ఈ ఆధార్ కార్డ్ గురించి ఆయన కూడా తన గుర్తింపు కార్డ్‌ను తీసుకొని భూలోకంలో అడుగు పెట్టాడు.

గణేశుడికి ఆధార్ కార్డ్ ఏంటీ అనుకుంటున్నరా.? అయితే మీరే చూడండి.

జార్ఖండ్ లోని జెంషెడ్‌పూర్‌కు చెందిన కొందరు యువకులు అందరికంటే కాస్త భిన్నంగా ఆలోచించారు.

ఏకంగా వినాయకుడి పేరు మీదే ఆధార్ కార్డు సృష్టించారు.అంతటితో ఆగకుండా వినాయకుడి ఆధార్‌‌తో మండపం ఏర్పాటు చేశారు.

ఇక ఇది చూసిన వారందరూ వావ్.వినాయకుడికి ఆధార్ కార్డ్ అంటూ సెల్ఫీలు దిగుతూ, చాలా సంబరపడిపోతున్నారు.

అడ్రస్ ఏం పెట్టారు అని అనుకుంటున్నారు కదా.పేరు : గణేష్ తండ్రి పేరు : మహాదేవ్ అడ్రస్ : కైలాస్ పర్వత శిఖరం, మానస సరోవరం సరస్సు దగ్గర పిన్ కోడ్ : 00001 డేట్ ఆఫ్ బర్త్ : 01/01/600CE ఆధార్ నెంబర్ : 9678 9959 4584 అంతే కాదండోయ్.

అక్కడున్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఏకంగా గణేశుడి ఫొటోస్ కనిపిస్తాయంట.ఇక యువకులు చేసిన ఈ పనికి అక్కడున్నవారే కాదండోయ్ ఇతర రాష్ట్రాల ప్రజలు సైతం మెచ్చుకుంటున్నారు.

ఇది చూసిన వారందరూ.సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రయాలను వ్యక్తం చేస్తుండగా, కొందరు భూలోకంలో వినాయకుడు ఆధార్ కార్డ్ బలే తెచ్చుకున్నాడు అంటూ సరదాగా ముచ్చటిస్తున్నారు.

ఆ వైసీపీ నేతతో పెళ్లంటూ జరిగిన ప్రచారంపై శ్రీరెడ్డి క్లారిటీ.. ఏం చెప్పారంటే?