వినాయక నిమజ్జనం ఏ సమయంలో చేయాలో తెలుసా?

మన హిందూ క్యాలెండర్ ప్రకారం భాద్రపద మాసంలో వినాయక చవితి ఉత్సవాలను ఎంతో భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరుపుకుంటాము.

వినాయక చవితి సందర్భంగా ప్రతి ఊరిలోనూ, వాడ వాడలో వినాయక ప్రతిమలను ప్రతిష్టించి భక్తి శ్రద్ధలతో, నైవేద్యాలతో స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించే అనంతరం వినాయకుడి విగ్రహాలను నిమజ్జనం చేస్తాము.

అయితే కొందరు ఒక రోజుకు నిమర్జనం చేయగా మరికొందరు మూడు,ఐదు,తొమ్మిది, 11 రోజులకు ఇలా ఎవరికి అనుగుణంగా వారు నిమజ్జనం చేస్తుంటారు.

ఈ విధంగా వినాయక చవితి రోజు స్వామివారికి పెద్ద ఎత్తున పూజలు చేసి నిమర్జనం చేయడం సర్వసాధారణం.

అయితే ఈ నిమజ్జన కార్యక్రమాలు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా చేస్తుంటారు.మరి నిమజ్జనం చేయడానికి సరైన సమయం ముహూర్తం ఏది అనే విషయానికి వస్తే మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాలలో కేవలం తొమ్మిది రోజులు మాత్రమే దైవత్వం ఉంటుంది.

ఆ తర్వాత ఆ విగ్రహాలకు ఏ విధమైనటువంటి దైవ శక్తులు ఉండవని పండితులు చెబుతున్నారు.

అందుకే వినాయక ప్రతిమలను తొమ్మిది రోజులకు నిమజ్జనం చేయడం ఎంతో శ్రేయస్కరమని పండితులు తెలియజేస్తున్నారు.

"""/"/ హిందూ క్యాలెండర్ ప్రకారం గణేష్ నిమర్జనం చతుర్దశి రోజున జరుపుకోవాలని పండితులు తెలియజేస్తున్నారు.

వచ్చే ఏడాది మళ్లీ వస్తానని చెబుతూ గణేష్ నిమజ్జనం చేస్తారు.హిందూ పంచాంగం ప్రకారం గణేష్ నిమజ్జనానికి చతుర్దశి అనగా 19వ తేదీ మధ్యాహ్నం 12:14 నిమిషాల నుంచి సాయంత్రం 7:39వరకు స్వామి వారి ప్రతిమలను నిమజ్జనం చేయడానికి ఎంతో శుభముహూర్తం అని పండితులు చెబుతున్నారు.

అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం.. అతిథులు ఎవరంటే?