పి.గన్నవరంలో ఆకట్టుకున్న వినాయక నిమజ్జనం విగ్రహాలు ఊరేగింపు
TeluguStop.com
హైదరాబాద్ లో భారీ విగ్రహాలు పెద్ద పెద్ద ట్రాలీలపై వినాయక నిమజ్జనం కోసం వెళ్తుంటే.
పి.గన్నవరం లో అతి చిన్న వినాయక విగ్రహాలు నిమజ్జనాల కోసం ట్రాలీలపై గోదావరి నది వద్దకు చేరుతున్నాయి.
బండెనుక బండి 32 బండ్లపై గణనాథుడు ఊరేగింపు ఘనంగా జరిగింది.అంబేడ్కర్ కోనసీమ జిల్లా పి.
గన్నవరం మండలం చాకలిపాలెం వద్ద ప్రత్యేకంగా తయారుచేసిన 32 బండ్లపై గణనాధుని వినూత్నంగా ఊరేగించారు.
అతి చిన్న వినాయక విగ్రహాలు తయారు చేసి వాటికోసం ఒక చిన్న ట్రాలీ కూడా తయారు చేసి ట్రాలీ పై ఎడ్ల బండి పెట్టి వాటిలో చిన్న చిన్న వినాయక విగ్రహాలు పెట్టి ఊరేగించారు.
ఊరేగింపు లో మహిళలు, చిన్నారులు, గ్రామస్తులు అందరూ కలిసి ఉత్సాహంగా ప్రధాన రహదారిపై ముందుకు లాగారు.
స్థానికులు ప్రయాణికులు అతి చిన్న గణనాధుని ఊరేగింపు అందరిని ఆకట్టుకుంది.గత 10 ఏళ్లుగా గా ఇదే మాదిరి చిన్న విగ్రహాలు పెట్టి ట్రాలీ పై పెట్టి ఊరేగింపు చేస్తున్నామంటున్నారు.
మా అమ్మకు పద్మశ్రీ ఎందుకు ఇవ్వలేదు.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!