శాంతియుత వాతావరణంలో గణేష్ నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి.
TeluguStop.com
నవరాత్రి వేడుకలు సందర్భంగా మండపాల వద్ద,నిమార్జనం సమయంలో డి.జే లకు అనుమతి లేదు.
నిర్దేశించిన సమయానికి మండపాల నిర్వాహకులు విగ్రాహల నిమార్జనం పూర్తి చెయాలి.నిబంధనలకు లోబడి గణేష్ ఉత్సవాలు జరుపుకోవాలి, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.సిరిసిల్ల పట్టణ పరిధిలోని కల్యాణ లక్ష్మీ గార్డెన్స్ లో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు, సిరిసిల్ల సబ్ డివిజన్ పరిధిలోని గణేష్ మండపాల నిర్వహకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గణేష్ నవరాత్రి ఉత్సవాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పాటించవలసిన నియమ నిబంధనాలపై దిశ నిర్దేశం చేసిన జిల్లా ఎస్పీ.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.పోలీస్ వారికి సహకరిస్తు శాంతియుత వాతావరణంలో వినాయక నవరాత్రి వేడుకలు జరుపుకోవాలి,పోలీస్ శాఖ నుండి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు.
మండపాల పూర్తి బాధ్యత మండపాల నిర్వహకులాదని,ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పకుండ ఏర్పాటు చేయలని,సీసీ కెమెరాల ఏర్పాటు వలన ఏ చిన్న సంఘటన జరిగిన గుర్తించ వచ్చన్నారు.
మండపాల వద్ద మద్యం సేవించడం,ఆసాంఘిక కార్యకలాపాలు పాల్పడితే వారితో పాటుగా మండపాల నిర్వహకులు పై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
ప్రతి మండపం వద్ద విధిగా పాయింట్ బుక్ ఏర్పాటు చేయడం జరుగుతుందని పోలీస్ అధికారులు,బ్లూ కోల్ట్ సిబ్బంది తరచు మండపాలు తనిఖీ చేయడం జరుగుతుందన్నారు.
ఇనుప వస్తువులతో మండపాలు ఏర్పాటు చేయవద్దని,షాట్ సర్క్యూట్ కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని,ప్రతి మండపాల నిర్వహకులు విద్యత్ శాఖ అనుమతి తీసుకోవాలి.
నవరాత్రి వేడుకలు సందర్భంగా మండపాల వద్ద,నిమార్జనం సమయంలో డి.జే లకు అనుమతి లేదు.
నవరాత్రి వేడుకల సందర్భంగా మండపాల్లో,నిమార్జనం రోజున డీజే లకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు.
అనుమతి లేకుండా డీజే మండపాల్లో కానీ నిమార్జనం రోజున ఉపయోగిస్తే డీజే వారితో పాటుగా మండపాల నిర్వహకులపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.
ఇప్పటికే జిల్లాలో డి.జే యజమానులకు కౌన్సెలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు.
నిర్దేశించిన సమయానికి మండపాల నిర్వాహకులు విగ్రాహల నిమార్జనం పూర్తి చెయాలి.గణేష్ నిమజ్జనం రోజున గణేష్ శోభయాత్ర రాత్రి 12 లోపు పూర్తి అయ్యేలా భక్తులు,గణేష్ మండపాల నిర్వహకులు పోలీస్ వారికి సహకరించాలని, రెండు మూడు రోజుల పాటుగా నిమజ్జనం చేస్తూ ప్రజలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు.
గత సంవత్సరం నిబంధనలకు విరుద్ధంగా రెండు మూడు రోజుల పాటుగా నిమజ్జనం చేస్తూ ప్రజలకు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై 10 కేసులు నమోదు చేయడం జరిగిందన్నారు.
నిమార్జననికి ముందు ప్రతి మండలంలో వివిధ శాఖల సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగిందని, ఏమైనా సమస్యలు ఉంటే వారి దృష్టికి తీసుకరావాలన్నారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ,డిఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి,సిరిసిల్ల ఆర్డీఓ రమేష్, మున్సిపల్ కమీషనర్ మీర్జా ఫసత్ అలీ బేగ్, జిల్లా పంచాయితీ అధికారి వీరబుచ్చయ్య,సి.
ఐ లు కృష్ణ, శ్రీనివాస్, మొగిలి,ఎస్.ఐ లు హిందూ ఉత్సవ కమిట్ సభ్యలు, మండపాల నిర్వహకులు పాల్గొన్నారు.
వాళ్ల వల్లే మద్యానికి బానిసయ్యానని చెప్పిన శృతి హాసన్.. ఈ షాకింగ్ విషయాలు తెలుసా?