రోగుల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్న గాంధీ ఆసుపత్రి వైద్యులు.. !

కరోనా వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న అవస్దలు చాలా దారుణంగా ఉన్నాయి.అంతే కాకుండా ప్రతి హస్పటల్లో బెడ్లు అన్నీ నిండిపోవడంతో, ఏదైనా సాధారణ వ్యాధి వచ్చినా నరకం కనిపిస్తుంది.

ముఖ్యంగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి రోగుల పాలిట నరకంగా మారిందనే ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

దీనికి కారణం గత వారం రోజుల క్ర్తితం కోవిడ్ సోకిన మహిళకు కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టు లేక పోవడం వల్ల సరైన సమయంలో వైద్యం అందించక పోవడంతో తీవ్ర వేదన పడుతూ మరణించిన సంఘటన సోషల్ మీడియాలో విపరితంగా ట్రోల్ అయ్యింది.

దీంతో ఇలాంటి దుస్దితి మరే పేషెంట్‌కు ఎదురవకూడదనే ఉద్దేశ్యంతో కరోనా వైరస్ సోకినట్టు రిపోర్టు లేకున్నా అత్యవసర చికిత్స కోసం వచ్చే రోగులకు వైద్యం అందించాలని నిర్ణయించినట్టు ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

ఈ క్రమంలో రోగి పరిస్దితి సీరియస్‌గా ఉన్న పరిస్థితుల్లో ఆసుపత్రిలోకి తీసుకొచ్చే అంబులెన్స్‌లను అడ్డుకోవద్దని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.

ప్రభాస్ లేకుండానే సలార్ 2 షూటింగ్.. విడుదల అయ్యేది అప్పుడేనా?