తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచింది..: ఎమ్మెల్సీ కవిత

నిజామాబాద్ జిల్లాలోని నవిపేటలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రోడ్ షో నిర్వహించారు.గాంధీలు చుట్టపు చూపుగా వచ్చి వెళ్తారని తెలిపారు.

తెలంగాణను గాంధీ కుటుంబం నిండా ముంచిందని ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.వందలాది మంది యువతను కాంగ్రెస్ బలి తీసుకుందని మండిపడ్డారు.

ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చుపెట్టాలని చూస్తోందని విమర్శించారు.ఈ క్రమంలోనే నీళ్లు ఇచ్చే వాళ్లు కావాలా? లేక కన్నీళ్లు ఇచ్చే వాళ్లు కావాలా? అని ఆమె ప్రశ్నించారు.

రైతుబంధు కావాలా? రాబంధు కావాలా? అని నిలదీశారు.కాంగ్రెస్ మూడు గంటల కరెంట్ కావాలా? బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ కావాలా? అనేది ప్రజలే ఆలోచించాలని సూచించారు.

హీరో రామ్ చరణ్ కెరీర్ లో ఆగిపోయిన 6 సినిమాలు ఇవే !