‘గాండీవధారి అర్జున’ ప్రీ టీజర్ డేట్ అండ్ టైం లాక్.. ఇంట్రెస్టింగ్ పోస్టర్ తో అనౌన్స్!

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన హీరోల్లో వరుణ్ తేజ్( Varun Tej ) ఒకరు.

ప్రెజెంట్ వరుణ్ తేజ్ క్రేజీ లైనప్ సెట్ చేసుకుంటున్నాడు.మరి ఆ సినిమాల్లో వరుణ్ తేజ్ నటిస్తున్న ''గాండీవధారి అర్జున''( Gandeevadhari Arjuna ) మూవీ ఒకటి.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చేస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్ చేస్తామని ఇటీవలే మేకర్స్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే.

"""/" / మరి ఆగస్టులో రిలీజ్ ఉండడంతో షూట్ ఫాస్ట్ గా పూర్తి చేసారు.

ఇప్పటికే షూట్ పూర్తి అవ్వడంతో ఇక మేకర్స్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసారు.ఈ క్రమంలోనే తాజాగా ప్రీ టీజర్ పై మేకర్స్ అప్డేట్ ఇచ్చారు.

ఈ టీజర్ ను రేపు అంటే జులై 12న ఉదయం 10 గంటల 8 నిముషాలకి రిలీజ్ చేస్తున్నట్టుగా ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను రిలీజ్ చేసారు.

ఈ పోస్టర్ ఫ్యాన్స్ ను ఆకట్టుకుంటుంది.ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి.

ఇక ఈ సినిమాలో వరుణ్ తేజ్ కు జోడీగా ఏజెంట్ బ్యూటీ సాక్షి( Sakshi Vaidya ) వైద్య హీరోయిన్ గా నటిస్తుండగా.

మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.అలాగే ఈ సినిమాని బివిఎస్ఎన్ ప్రసాద్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

మరి ఈ ప్రీ టీజర్ ఎలా ఉంటుందో వరుణ్ తేజ్ ఈసారి కూడా హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

"""/" / ముందు నుండి వరుణ్ తేజ్ డిఫరెంట్ సినిమాలతో మెగా ఫ్యాన్స్ ను అలరిస్తున్నాడు.

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలను ఎంచుకుంటూ నటన లో కూడా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు.

అందుకే ఈయన సినిమా వస్తుంది అంటే ఏదొక కొత్తదనం ఉంటుంది అని ఫ్యాన్స్ సైతం ఎదురు చూస్తున్నారు.

మరి ఈ సినిమా ఎలాంటి అంచనాలను క్రియేట్ చేస్తుందో వేచి చూడాల్సిందే.

జలుబు ఉక్కిరిబిక్కిరి చేస్తుందా.. రెండు రోజుల్లో వదిలించుకోండిలా!