‘గేమ్ ఛేంజర్’ సాంగ్ లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్.. క్లారిటీ ఇదే!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్( Ram Charan ) కు ఇప్పుడు గ్లోబల్ వైడ్ గా పేరు ఉంది.

ఆర్ఆర్ఆర్ ( RRR Movie )ఇచ్చిన ఫేమ్ ను మరింత పెంచుకునేలా చరణ్ తన లైనప్ ను సెట్ చేసుకుంటున్నాడు.

ప్రజెంట్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమాల్లో ''గేమ్ ఛేంజర్''( Game Changer ) ఒకటి.

ఈ సినిమా కోసం మెగా ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమాను అగ్ర డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్నాడు.

"""/" / అయితే ఈ సినిమాపై మెగా ఫ్యాన్స్ సైతం గరంగరంగా ఉన్నారు.

అందుకు కారణం ఇప్పటి వరకు ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

దీంతో ఫ్యాన్స్ నిరాశగా ఉన్నారు.అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక సాంగ్ లీక్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది అనే చెప్పాలి.

ఈ సాంగ్ నెట్టింట తెగ వైరల్ అవ్వడంతో ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది.

ఇక ఈ లీక్ అయిన సాంగ్ గురించి తాజాగా ఒక అప్డేట్ తెలుస్తుంది.

లీక్ అయిన సాంగ్ అయితే ఫైనల్ వర్షన్ కాదట.టెస్టింగ్ సాంగ్ మాత్రమే అని టాక్.

మెయిన్ సాంగ్ ను స్టార్ సింగర్స్ తో పాడించడం ఫైనల్ వర్షన్ చేసి వంటి చాలా పనులు ఉన్నాయట.

అలాగే సాంగ్ లీక్ వెనుక ఎవరు ఉన్నారు అనే విషయంలో కూడా మేకర్స్ తగిన యాక్షన్ తీసుకుంటున్నారని తెలుస్తుంది.

"""/" / అయితే ఈ సాంగ్ ఫైనల్ వర్షన్ కాకపోయినా ఎలా ఉంటుంది అనే విషయం బయటకు రావడంతో చార్ట్ బస్టర్ ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్ తెగ ఎగ్జైట్ అవుతున్నారు.

కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ( Kiara Advani ) హీరోయిన్ గా నటించింది.

చూడాలి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – జనవరి8, బుధవారం 2025