బాబాయ్ పవన్ ను చూసి శంకర్ ఇలా రాసుంటారు.. చరణ్ ఆసక్తికర వ్యాఖ్యలు వైరల్!
TeluguStop.com
శంకర్( Shankar ) దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.
( Game Changer ) త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.
ఇంటర్వ్యూలకు హాజరవుతూ బిజీ బిజీగా ఉన్నారు.తాజాగా మూవీ మేకర్స్ రాజమండ్రిలో ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించిన విషయం తెలిసిందే.
ఈ ఈవెంట్ లో భాగంగా రామ్ చరణ్,దిల్ రాజు, శంకర్ వంటి వారు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ. """/" /
సినిమాలో నేను గేమ్ చేంజర్‌ని కావచ్చు.
కానీ ఈ రోజు ఇండియన్ పాలిటిక్స్ లో పవన్ కళ్యాణ్ గారు( Pawan Kalyan ) రియల్ గేమ్ చేంజర్.
పవన్ కళ్యాణ్ గారి లాంటి వారిని చూసే శంకర్ గారు ఇలాంటి పాత్రలు రాసి ఉంటారు అని రామ్ చరణ్ అన్నారు.
రాజమండ్రి బ్రిడ్జ్ మీద పవన్ కళ్యాణ్ గారు మొదటి సారి ర్యాలీ చేసినప్పుడు జన సంద్రం కనిపించింది.
మళ్లీ ఇప్పుడు ఇక్కడ కూడా అలానే అనిపిస్తుంది.ఈ ఈవెంట్‌కు వచ్చిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి థాంక్స్.
మంచి సినిమా చేశాము.అందరిని అలరించేలా దర్శకుడు తెరకెక్కించారు.
ఇంకో సందర్భంలో మరింత మాట్లాడుతాను.నన్ను క్షమించండి అని అన్నారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
"""/" /
ఈ ఈవెంట్ భాగంగా అనంతరం డైరెక్టర్ శంకర్ మాట్లాడుతూ నేను నా కూతురి పెళ్లి శుభలేఖ ఇచ్చేందుకు పవన్ కల్యాన్ దగ్గరకు వెళ్లాను.
ఆయన మమ్మల్ని ఎంతో బాగా రిసీవ్ చేసుకున్నారు.ఎంతో చక్కగా మాట్లాడారు.
ఆయనతో ఉన్న కొన్ని క్షణాల్లోనే ఎంతో నచ్చేశారు.నా ఇన్నేళ్ల కెరీర్ లో ఒక్క తెలుగు సినిమా చేయలేదు.
అయినా నన్ను ప్రేమిస్తూనే వచ్చారు.ఎలాగైనా ఒక తెలుగు సినిమా చేయాలనుకున్నాను.
నాకు ఈ అవకాశం ఇచ్చిన దిల్ రాజు( Dil Raju ) గారు, రామ్ చరణ్ గారికి థాంక్స్.
మినిస్టర్, కలెక్టర్‌కు జరిగే వార్ నేపథ్యంలో సినిమా ఉంటుంది.హీరో ఫ్లాష్ బ్యాక్ అద్భుతంగా ఉంటుంది.
రామ్ చరణ్ గారు తన పాత్రల్లో జీవించేశారు.ఎంతో సహజంగా నటించారు.
అంజలి, కియారా, శ్రీకాంత్ గారు, నవీన్ చంద్ర, ఎస్ జే సూర్య, ఇలా అందరూ చక్కగా నటించారు అని తెలిపారు శంకర్.
నాగార్జునతో అలాంటి సినిమా తీస్తానని చెబుతున్న అనిల్ రావిపూడి.. ఈ కాంబో సాధ్యమేనా?