అఫీషియల్: గేమ్ ఛేంజర్ జరగండి పాట విడుదల వాయిదా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ramcharan ) హీరోగా శంకర్ ( Shankar ) దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం గేమ్ ఛేంజర్( Game Changer ) .

ఈ సినిమా వచ్చే వేసవి సెలవులలో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలుస్తుంది.అయితే గత కొంతకాలంగా ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ లేకపోవడంతో అభిమానులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే జరగండి అంటూ సాగే సాంగ్ దీపావళి పండుగ సందర్భంగా విడుదల చేస్తామంటూ ఇదివరకు ప్రకటించారు.

"""/" / ఈ పాట దీపావళి పండుగను పురస్కరించుకొని విడుదల చేయబోతున్నామని తెలియజేయడంతో ఈ పాట కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

అయితే గత రెండు రోజులుగా ఈ పాట విడుదల వాయిదా కానుంది అంటూ వార్తలు వచ్చినప్పటికీ ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోవడంతో తప్పకుండా ఈ పాట విడుదలవుతుందని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

ఈ క్రమంలోనే చిత్ర బృందం నుంచి జరగండి ( Jaragandi Song ) అనే పాటను వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

"""/" / ఈ పాట వాయిదా పడడానికి గల కారణాలను కూడా తెలియజేశారు.

ఈ పాటకు సంబంధించి ఆడియో డాక్యుమెంటేషన్ లో పలు రకాల సమస్యలు తలెత్తాయని అందుకే ఈ పాటను వాయిదా వేస్తున్నామంటూ తెలియజేశారు.

అయితే తిరిగి ఎప్పుడు విడుదలవుతుందనే విషయాన్ని త్వరలోనే ప్రకటిస్తామంటూ మేకర్స్ అధికారికంగా తెలియజేయడంతో రామ్ చరణ్ అభిమానులు ఈ విషయంపై మరోసారి అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ఈ సినిమా వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.

పుష్ప ది రూల్ మూవీ రీలోడెడ్ వెర్షన్ టికెట్ రేట్లు ఇవే.. టికెట్ రేట్లు ఎంతంటే?