ఆ ఏరియాలో చరణ్ గేమ్ ఛేంజర్ మూవీకి కలెక్షన్లే రాలేదా.. అసలేం జరిగిందంటే?
TeluguStop.com
తమిళ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్( Ram Charan ) హీరోగా నటించిన తాజా చిత్రం గేమ్ చేంజర్.
( Game Changer ) ఈ సినిమా తాజాగా భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే.
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు మిశ్రమ స్పందన లభించింది.రివ్యూలు కూడా ఏమంత గొప్పగా లేవు.
తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ మలయాళ భాషల్లో కూడా ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
హీరో రామ్ చరణ్ నటనకు ప్రశంసలు దక్కుతున్నా, శంకర్ అవుట్ డేటెడ్ ఫ్లాట్ స్క్రీన్ ప్లే సినిమాను దెబ్బ కొట్టిందని ఆడియన్స్ అభిప్రాయ పడుతున్నారు.
"""/" /
గేమ్ ఛేంజర్ లో చర్చించిన రాజకీయాలు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనూ అసాధ్యమని, లాజిక్ లేకుండా తీశారని చాలా మంది సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.
సాంగ్స్ కోసం 75 కోట్లు చేసి విజువల్ వండర్ తీర్చిదిద్దే ప్రయత్నం చేసిన శంకర్( Shankar ) మిగతా సినిమా మేకింగ్ మీద కూడా మరింత దృష్టి పెట్టాల్సింది అని కామెంట్లు వినిపిస్తున్నాయి.
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ గేమ్ ఛేంజర్ సినిమాతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని తమిళ తంబీలు ఆశించారు.
కానీ దర్శకుడు మళ్లీ యావరేజ్ సినిమాతో ప్రేక్షకులను నిరాశపరిచారు.తమిళనాడులో తొలిరోజు బుకింగ్స్ చాలా సెంటర్లలో యావరేజ్ గా ఉన్నాయి.
"""/" /
శంకర్ బ్రాండ్, ఆర్ఆర్ఆర్ స్టార్ ఉన్నప్పటికీ ఈ సినిమా తమిళ మార్కెట్ లో ఏమంత గొప్ప ఓపెనింగ్స్ సాధించలేదు.
హిందీ బెల్ట్ లోనూ రామ్ చరణ్ మూవీ పరిస్థితి అలానే ఉందని తెలుస్తోంది.
పుష్ప 2 చిత్రాన్ని ఆదరించిన ఉత్తరాది జనాలు గేమ్ ఛేంజర్ పట్ల పెద్దగా ఆసక్తి కనబరచలేదు.
కాకపోతే నిన్న నైట్ షోలలో నార్త్ ఇండియాలో కొన్ని మేజర్ సిటీస్ లలో సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిందని ట్రేడ్ వర్గాలు తెలిపాయి.
ఇక మలయాళంలో( Malayalam ) గేమ్ ఛేంజర్ సినిమాకి భారీ ఎదురు దెబ్బ తగిలినట్లుగా చెబుతున్నారు.
కేరళలో ఫస్ట్ డే అసలు థియేటర్ షేర్ రాలేదని అంటున్నారు.రాధే శ్యామ్ తర్వాత, కేరళలో ఓపెనింగ్ డే నాడు జీరో షేర్ నమోదు చేసిన టాలీవుడ్ పాన్ ఇండియన్ స్టార్ సినిమా ఇదేనని ట్రేడ్ వర్గాలు పేర్కొన్నాయి.
వైరల్.. ఎలా వస్తాయి ఇలాంటి ఆలోచనలు.. బ్యాంకు డిపాజిట్ స్లిప్ పై ఏకంగా?