కర్ణాటకలో విజయభేరి మోగించిన కాంగ్రెస్ – సంబరాలు చేసుకున్న గంభీరావుపేట కాంగ్రెస్ నాయకులు
TeluguStop.com
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ ఆధ్వర్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపుని పురస్కరించుకొని పెద్ద ఎత్తున విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
బాణాసంచా కాల్చి,స్వీట్లు పంపిణీ చేసుకోవడం జరిగింది.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు హమీద్ మాట్లాడుతూ విభజన రాజకీయాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నీ నమ్మి కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ కి పట్టం కట్టిన కర్ణాటక ప్రజలందరికీ చేతులు జోడించి,శిరస్సు వంచి వందనాలు తెలిపారు.
విద్వేష రాజకీయాలకు భారతదేశ ప్రజలు ఎన్నటికీ సహించరని బిజెపి పార్టీకి గట్టి గుణపాఠం చెప్పారని ఈ సందర్భంగా తెలిపారు.
ఇది ఆరంభం మాత్రమేనని అంతం దీనికన్నా తీవ్రంగా ఉంటుందని అన్నారు.కర్ణాటక కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కలసికట్టుగా కార్యకర్తలను సన్నద్ధం చేసిన విధానం హర్షనీయమని వారిని ఆదర్శంగా తీసుకొని తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజల 60 ఏళ్ల కళను సహకారం చేసిన సోనియా గాంధీ కి కృతజ్ఞతలు తెలుపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని రాబోయే తెలంగాణ శాసనసభ ఎన్నికలలో ఇదే ఫలితాలు ఉంటాయని హమీద్ ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా బిజెపిపై తీవ్ర విమర్శలు చేశారు.గడిచినటువంటి 8 సంవత్సరాల నుంచి కేవలం కొంతమంది సంపన్నులకు న్యాయం చేసే విధంగా మోడీ ప్రభుత్వం పని చేసిందని పేద, మధ్యతరగతి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేసిన కార్యక్రమాలు శూన్యమని దేశంలో నిరుద్యోగత పెరిగిపోయిందని దుయ్యబట్టారు.
ఇప్పటికైనా కేంద్రం ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకొని యువతకు ఉద్యోగాలు కల్పించాలని పెంచిన పెట్రోల్,డీజిల్ చార్జీలను తగ్గించాలని ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ స్థాపించిన ప్రభుత్వ సంస్థలను అమ్మే ఆలోచనను విరమించుకోవాలని
లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ ఈ దేశంలో తన ఉనికిని కోల్పోవడం పెద్ద సమస్య కాదని తెలిపారు.
అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో గడీలలో బందీ అయిన తెలంగాణ తల్లి సంకెళ్లను తెంచడానికి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం,కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రాబోయే శాసనసభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గంభీరావుపేట మండల కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
మొదటి భర్త గురించి పరోక్షంగా షాకింగ్ కామెంట్స్ చేసిన అమలాపాల్.. అసలేమైందంటే?