గంభీరావుపేట గ్రామ పంచాయతీలో బిల్ కలెక్టర్ గా విధులు

గంభీరావుపేట గ్రామ పంచాయతీ( Gambhiraopet Gram Panchayti )లో బిల్ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న సంగ మధును అవినీతి ఆరోపణలపై జిల్లా పంచాయితీ అధికారి ఎ రవీందర్ సస్పెండ్ చేయడం జరిగింది.

గంభీరావుపేట గ్రామ పంచాయతీకి చెందిన చీరాల ప్రవీణ్ గౌడ్ తన ఇంటికి సంబంధించి ఇంటి నెంబర్ కేటాయించాలని కోరగా దానికి డబ్బులు డిమాండ్ చేశారని రూ.

5 వేలు ఫోన్ పే ద్వారా బిల్ కలెక్టర్ సంగ మధుకు పంపినప్పటికీ మరిన్ని డబ్బులు డిమాండ్ చేయడంతో జిల్లా పంచాయతీ అధికారికి వివరాలతో పిర్యాదు చేశారు.

పిర్యాదులోని ప్రాథమిక ఆధారాలను బట్టి బిల్ కలెక్టర్ సంగ మధును విధుల నుంచి సస్పెండ్ చేస్తూ పూర్తి స్థాయి విచారణకు ఆదేశించడం జరిగిందనీ జిల్లా పంచాయితీ అధికారి తెలిపారు.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో నటిస్తున్న మలయాళం స్టార్ హీరో…