గాలోడు టీజర్ రిలీజ్.. సుడిగాలి సుధీర్ మేకోవర్ మాములుగా లేదుగా?

బుల్లితెరపై ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ అదే పాపులారిటీతో పలు సినిమాలలో నటించారు.

అయితే ఈ రెండు సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోవడంతో ఈ సారి మాస్ యాక్షన్ తరహాలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.

ఈ క్రమంలోనే సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ దర్శకత్వంలో గాలోడు అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

సుధీర్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా నుంచి తాజాగా టీజర్ విడుదల చేశారు .

ఇందులో సుధీర్ మేకోవర్ డిఫరెంట్ గా ఉండడమే కాకుండా నాకు ఎవరిపై నమ్మకం లేదు నన్ను నేను నమ్ముకుంటా అని సుధీర్ చెప్పే డైలాగ్ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది.

ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ సినిమాలో సుధీర్ లుక్ ప్రతి ఒక్క ప్రేక్షకుడిని ఎంతగానో ఆకట్టుకుందని చెప్పవచ్చు.

ఇకపోతే ఈ టీజర్ లో సప్తగిరి, పృథ్వీ కనిపించారు.శరవేగంగా షూటింగ్ పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలోనే విడుదల కానుందని చిత్ర బృందం ఈ సందర్భంగా వెల్లడించారు.

ప్రస్తుతం సుధీర్ గాలోడు టీజర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఆ ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్న డాకు మహారాజ్.. మూవీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పుడేనా?