సూపర్ స్టార్ మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా హీరోగా పరిచయం కాబోతున్నాడు.
హీరో అనే టైటిల్ తో రాబోతున్న ఈయన ఇప్పటికే తన ఫస్ట్ లుక్ తో ఆకట్టుకున్నాడు.
సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యి చాలా రోజులు అయ్యింది.కరోనా కారణంగా ఆలస్యం అవుతూ వచ్చింది.
ఎట్టకేలకు సినిమా షూటింగ్ కు గుమ్మడి కాయ కొట్టినట్లుగా తెలుస్తోంది.ప్రముఖ స్టార్ జగపతి బాబు ఈ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా లో జగపతిబాబు పాత్ర అత్యంత ప్రత్యేకంగా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
ఇక ఈ సినిమా చిత్రీకరణ ముగించుకున్న జగపతిబాబు తాజాగా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేశాడు.
శ్రీరామ్ ఆధిత్య దగ్గర ఉండి మరీ జగపతిబాబు తో డబ్బింగ్ చెప్పాడు.అద్బుతంగా సినిమా వచ్చిందని.
జగపతిబాబు పాత్ర సినిమాలో చాలా హైలైట్ గా నిలుస్తుందని యూనిట్ సభ్యులు చెబుతున్నారు.
సూపర్ స్టార్ ఫ్యామిలీ నుండి ఇప్పటికే పలువురు హీరోలు ఉన్నారు.ఈ సమయంలో మరో హీరో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు.
ఇండస్ట్రీలో గల్లా వారసుడు ఎంత వరకు ప్రభావం చూపిస్తాడు అనేది ఆసక్తికరంగా మారింది.
"""/"/
మామ మహేష్ బాబు అశోక్ హీరో సినిమాకు పూర్తి సహాయ సహకారం అందించే అవకాశం ఉంది.
కనుక ఈ సినిమా ప్రత్యేకంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమా లో గల్లా అశోక్ కు జోడీగా ముద్దుగుమ్మ నభా నటేష్ నటిస్తున్న విషయం తెల్సిందే.
ఇక గల్లా వారి సినిమా విషయంలో ఇండస్ట్రీ వర్గాల్లో ఇప్పటికే చర్చ మొదలు అయ్యింది.
సూపర్ స్టార్ కృష్ణ సూపర్ హిట్ పాట ఈ సినిమా లో రీమేక్ చేశారు.
గట్టిగా క్లాస్ పీకాను.. అప్పటినుంచి రెచ్చిపోయాడు.. స్టార్ హీరో నాని కామెంట్స్ వైరల్!