తాగిన మత్తులో వేలు కత్తిరించుకున్న హీరోయిన్.. ఎవరంటే..?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అనే మాటను మనం తరచూ వింటూ ఉంటాం.మద్యం తాగిన సమయంలో చాలామంది వింతగా ప్రవర్తిస్తూ ఉంటారు.

అయితే హాలీవుడ్ నటి గాల్ గ్యాడ‌ట్ మద్యం తాగి ఆ మత్తులో కూరగాయలను కట్ చేయబోయి చేతివేలును కత్తిరించుకున్నారు.

ఒక ఇంటర్వ్యూలో గాల్ గ్యాడట్ మాట్లాడుతూ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు.కరోనా వైరస్ మొదట విజృంభించిన సమయంలో ఈ ఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.

సాధారణంగా ఉదయం 11 గంటల సమయంలో ఎవరూ డ్రింక్ చేయరని కానీ తాను మాత్రం చేయాల్సి వచ్చిందని ఆమె తెలిపారు.

తాను డ్రింక్ చేసిన సమయంలో భర్త క్యాబేజీ సలాడ్ చేయమని చెప్పడంతో క్యాబేజ్ సలాడ్ చేయడానికి వంటింట్లోకి వెళ్లానని ఆమె చెప్పుకొచ్చారు.

క్యాబేజీని కట్ చేయడం కోసం పదునైన కత్తిని తీసుకున్నానని కట్ చేస్తున్న సమయంలోనే తన వేలు తెగిందని ఆమె తెలిపారు.

"""/"/ కత్తితో వేలికి అయిన గాయం చిన్న గాయం కానే కాదని వేలు పై భాగం తెగిపడటంతో ఇబ్బంది పడ్డానని ఆమె చెప్పుకొచ్చారు.

ఈ ఘటన జరిగిన వెంటనే భర్త యారన్ తన దగ్గరకు వచ్చి తెగిపడిన వేలు పై భాగాన్ని చెత్తబుట్టలోకి విసిరేశాడని ఆమె చెప్పుకొచ్చారు.

తెగిపడిన వేలును అతికించడం సాధ్యం కాదనే విషయం తెలిసి అతికించాలనే ఆలోచన చేయలేదని యారన్ అన్నారు.

గాల్ గ్యాడర్ తాగిన మత్తులో వేలు కట్ చేసుకున్నానని చెప్పడంపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

డ్రింకింగ్ హ్యాబిట్ ను మానుకోవాలని పలువురు నెటిజన్లు ఆమెకు సూచనలు ఇస్తున్నారు.ఇప్పటికే ఇద్దరు బిడ్డలకు జన్మినిచ్చిన గాల్ గ్యాడట్ త్వరలో మూడో బిడ్డకు జన్మనివ్వబోతున్నారు.

గాల్ గ్యాడట్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకోవడం గమనార్హం.

ఇక టార్గెట్ కొడాలి నాని ? అన్నీ సిద్ధం చేస్తున్నారా ?