గాజువాక కండక్టర్ ఝాన్సీ ఒక్కరోజు కాల్ షీట్ కోసం ఎంత తీసుకుంటారో తెలుసా?
TeluguStop.com
సోషల్ మీడియా ద్వారా ఎంతో మంది సెలబ్రిటీలుగా మారిన వారు ఉన్నారు.తమలో దాగి ఉన్న టాలెంట్ బయట పెట్టి సోషల్ మీడియా వేదికగా ఆ వీడియోలను షేర్ చేయడంతో ఎంతోమంది సెలబ్రిటీలుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న వారు ఉన్నారు.
అయితే ఇలా టాలెంట్ ఉన్న వారిని ప్రోత్సహించడానికి మల్లెమాలవారు ముందు వరుసలో ఉంటారని చెప్పాలి.
ఈ క్రమంలోనే ఇప్పటికే ఎంతోమంది కొత్తవారిని ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత మల్లెమాల వారికి ఉంది.
తాజాగా గాజువాక కండక్టర్ ఝాన్సీను శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం చేసిన విషయం మనకు తెలిసిందే.
పల్సర్ బండి ఎక్కి అనే పాట ద్వారా బుల్లితెర ప్రేక్షకులను సందడి చేసిన ఝాన్సీ ప్రస్తుతం అనేక ఇతర టీవీ కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు.
ఇలా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమం ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైన ఈమె సెలబ్రెటీగా మారిపోయారు.
శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి రాకముందు ఈమె పలు ఈవెంట్లలో సందడి చేసినప్పటికీ ఒక్కో ఈవెంట్ కోసం 5000 లేదా 6000 రూపాయల రెమ్యూనరేషన్ తీసుకునే వారట.
"""/"/
ఈ విధంగా శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంతో ఈమె ఒక్కసారిగా రావడమే కాకుండా ఇతర కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున అవకాశాలు రావడంతో ఈమె సెలబ్రెటీగా మారిపోయారు.
ఈ విధంగా ఈమెకు ఎంతో డిమాండ్ ఏర్పడటంతో రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేస్తున్నారని తెలుస్తోంది.
ఇకపోతే కార్యక్రమానికి వచ్చిన తర్వాత ఈమె ఏకంగా ఒక్కో కాల్ షీట్ కోసం 50 వేల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తున్నారని తెలుస్తుంది.
ఏది ఏమైనా ఒక వీడియోతో ఈమె సెలబ్రిటీగా మారిపోయారు.
అల్లు అర్జున్ కోసం రాని తారక్… ఎన్టీఆర్ రాకపోవడానికి అదే కారణమా?