నా తండ్రి వల్ల చచ్చిపోవాలనుకున్నా.. గాజువాక కండక్టర్ ఝాన్సీ కామెంట్స్ వైరల్!
TeluguStop.com
టాలీవుడ్ సీనియర్ యాంకర్ ఓంకార్ హోస్టుగా వ్యవహరిస్తున్న షో డాన్స్ ఐకాన్.ప్రముఖ తెలుగు ఓటిటి ఆహా లో ఈ షో ప్రసారమవ్వుతున్న విషయం మనందరికీ తెలిసిందే.
ప్రతి శని,ఆదివారాలలో ప్రసారం అవుతున్న ఈ షో ఇప్పటికే 7 వారాలు అనగా 14 ఎపిసోడ్స్ ని విజయవంతంగా పూర్తి చేసుకుంది.
ఇకపోతే ఎనిమిదవ వారం సందర్భంగా 15, 16వ ఎపిసోడ్స్ ప్రస్తుతం స్ట్రీమింగ్ కి రెడీ అవుతున్నాయి.
తాజాగా ఇందుకు సంబంధించిన ప్రోమోని విడుదల చేశారు.ఈ షోకి సీనియర్ నటి రమ్యకృష్ణ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ జెడ్జ్ లుగా వ్యవహరించారు.
కాగా ఎపిసోడ్ ప్రారంభం నుంచి ఎండింగ్ వరకు షో మొత్తం ఎనర్జిటిక్ గా అదిరిపోయే పర్ఫామెన్స్ లతో ఆకట్టుకుంది.
కంటిస్టెంట్ లు ఒకరినీ మించి మరొకరు డాన్స్ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టారు.కాగా ఈ షోలో యాంకర్ శ్రీముఖి,కొరియోగ్రాఫర్ యష్ మాస్టర్,మోనార్ గజ్జర్ లు టీం లీడర్ లుగా వ్యవహరించారు.
కాగా ప్రోమోలో శ్రీముఖి టీం నుండి ఆసిఫ్ పర్ఫామెన్స్ చేయగా ఆసిఫ్ తో పాటు గాజువాక కండక్టర్ ఝాన్సీ కూడా పెర్ఫార్మన్స్ ను ఇరగదీసింది.
పర్ఫామెన్స్ ను ఇరగదీసిన ఝాన్సీ ఆ తర్వాత చివర్లో ఎమోషనల్ అయింది. """/"/
ముఖ్యంగా తన తండ్రి కారణంగా తాను ఎన్నో సార్లు చనిపోవాలి అనుకున్నట్లు స్టేజ్ పై చెబుతూ ఎమోషనల్ అయింది.
తన తల్లి కోసం తమ్ముడి కోసం డాన్స్ తో పాటుగా ఉద్యోగం సంపాదించుకుని పైకి వచ్చినట్లు చెబుతూ ఎమోషనల్ అయింది.
ఝాన్సీ బాధను విని పలువురు ఎమోషనల్ అయ్యారు.కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతోంది.
సంక్రాంతికి వస్తున్నాం ఆ మార్క్ ను టచ్ చేయడం పక్కా.. 2025 బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుందా?