జోగులాంబా జిల్లా వడ్డేపల్లి మండలం జిల్లేడుదిన్నె గ్రామానికి చెందిన మల్లికార్జున్ సోషల్ మీడియాలో వీడియోలు పెడుతూ బాగా పేరు తెచ్చుకున్నాడు మల్లికార్జున్.
అయితే అతనికి మొదటి నుంచే ఆస్తమాతో పాటు వివిధ అనారోగ్య సమస్యలు ఉన్నాయని చెబుతున్నారు కుటుంబ సభ్యులు.
దీంతో వాటితో నిత్యం బాధ పడేవాడు.అయినా సరే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా వీడియోలు చేసేవారు.
"""/"/
మొన్న చేసిన ఆర్జీవీ వీడియో కూడా బాగానే ఫేమస్ అయింది.ఇక ఇతని మీద సోషల్ మీడియాలో మీమ్స్‌కూడా క్రియేట్ చేస్తున్నారు మీమర్స్.
తనదైన టైమింగ్ అండ్ డైలాగులతో ఎంతో మందిని అలరిస్తున్న ఈ బుడ్డోడు.చివరకు ఇలా చనిపోవడం అందరినీ విషాదానికి గురి చేస్తోంది.
ఇందుకు సంబంధించిన వార్త నెట్టింట్లో వైరల్ గా మారింది.ఈ వార్త తెలుసుకున్న అతని ఫాలోవర్స్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
చాలా మంది సోషల్ మీడియాలో అతనికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.తల్లిదండ్రులు శోక సంద్రంలో మునిగిపోయారు.