నంది అవార్డుల స్థానంలో గద్దర్ అవార్డులు సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో నంది అవార్డుల ప్రధానోత్సవం( Nandi Awards Ceremony ) చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నంది అవార్డుల ప్రధానోత్సవం జరిగింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అదే విధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు.

అయితే రాష్ట్ర విభజన జరగటంతో నంది అవార్డుల కార్యక్రమం గందరగోళంగా మారింది.ఆంధ్రాలో ఏర్పడిన రెండు ప్రభుత్వాలు తెలంగాణలో అప్పట్లో బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఏవి కూడా నిర్వహించలేదు.

"""/" / ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో.కాంగ్రెస్ ప్రభుత్వం( Congress ) కొలువుదీరిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినిమా అవార్డులపై కీలక ప్రకటన చేశారు.

విషయంలోకి వెళ్తే బుధవారం హైదరాబాద్ రవీంద్ర భారతిలో ఏర్పాటు చేసిన గద్దర్ జయంతి కార్యక్రమంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ( CM Mallu Bhatti Vikramarka )పాల్గొనడం జరిగింది.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.నంది అవార్డులు పునరుద్ధరించాలని సినీ ప్రముఖులు కోరారు.

దీంతో నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో సినిమా అవార్డులు ఇవ్వనున్నట్లు తెలిపారు.

గద్దరన్న పేరు మీద సినీ కళాకారులకు పురస్కారాలు అందజేస్తామని తెలిపారు.దీనిపై త్వరలో జీవో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.

వైరల్ వీడియో: భూమి నుండి10 అడుగుల ఎత్తులోకి ఎగిసిపడుతున్న నీరు