బదనకల్ లో గడపగడపకు కాంగ్రెస్ పార్టీ

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla ) ముస్తాబాద్ మండలంలోని బదనకల్ గ్రామంలో గడపగడపకు కాంగ్రెస్ ప్రచారం ఉదృతంగా సాగుతుంది.

ముస్తాబాద్ మండల అధ్యక్షులు ఏళ్ల బాల్ రెడ్డి ఆధ్వర్యంలో తనదైన శైలిలో అధికారపక్షంపై విమర్శలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కంటే ముందు వరసలో ఉంటూ ఇప్పటికే ఒక దశ ప్రచారం ముగింపు దశలో ఉందన్నారు.

ప్రతి గ్రామంలో అందరినీ కలుపుకుంటూ ప్రజలతో మమేకమై ప్రచారం కొనసాగిస్తున్నారు.ప్రజలు కూడా అదే రీతిలో స్పందిస్తూ అభినందిస్తు మద్దతు తెలియజేస్తున్నారు.

గడపగడపకు కాంగ్రెస్ ప్రచారంలో ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కేకే మహేందర్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గడిచిన గత తొమ్మిదేళ్ల పాలనలో డబుల్ బెడ్ రూమ్ లు లేవు, దళిత ముఖ్యమంత్రి లేడు.

దళితులకు మూడెకరాల భూమి లేదు అన్నారు.నిరుద్యోగులకు కన్నీళ్లే మిగిలాయని,రైతులకు ఆత్మహత్యలే శరణ్యం అయినాయన్నారు.

ఇన్ని రోజులు మోసం చేసింది చాలదు అంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను కాపీ కొట్టడం కేసీఆర్( CM KCR ) దిగజారుడు తనానికి నిదర్శనం అన్నారు.

కాంగ్రెస్ వి అమలు కానీ హామీలు అని చెప్పి అదే హామీలను కాంగ్రెస్ పార్టీ కంటే ఎక్కువ ఇస్తాము అని చెప్పడం నిజంగా సిగ్గుచేటు అన్నారు.

ఈ బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని అర్థమై ఎలాగోలా మోసం చేద్దాము అని అనుకుంటున్నారన్నారు.

ప్రజలు బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడానికి సన్నద్దులై ఉన్నారు.దీన్ని ఎవరూ ఎన్ని కుయుక్తులు పన్నినా ఆగదు అన్నారు.

కాంగ్రెస్ పార్టీ విజయడంకా మోగించడం తద్యం అన్నారు.కాంగ్రెస్ పార్టీ( Congress Party ) అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి పేద మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని, అదేవిధంగా ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తామన్నారు.

రైతుకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని,15 వేల రూపాయల పెట్టుబడి సాయం ఇస్తామని అన్నారు.

పండిన పంటకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.

రైతు కూలీలకు ప్రతి ఏటా 12 వేల రూపాయలు అందిస్తామన్నారు.వృద్ధులకు ఆసరా పెన్షన్లు 4000 రూపాయలు ప్రతి నెల మొదటి వారంలోనే ఇస్తామన్నారు.

అలాగే ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్నారు./br> ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇంటికి రూపాయలు ఐదు లక్షల సహాయం చేస్తామని, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స, పది లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా( Rajiv Aarogyasri Health Insurance ) అందిస్తామని తెలిపారు.

యువ వికాసం పేరిట విద్యార్థులకు 5 లక్షల విద్యాభరోసా కార్డు,ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామ న్నారు.

కాంగ్రెస్ పార్టీ చెబితే చేస్తుందని,మాట నిలబెట్టుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ పట్టణ అధ్యక్షులు గజ్జెల రాజు, ఎస్టీ సెల్ మండల అధ్యక్షుడు గోవర్ధన్ నాయక్, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు తలారి నర్సింలు, ఎస్సీ సెల్ జిల్లా కో కన్వీనర్ గంగాధరి రమేష్, బంధనకల్ గ్రామ శాఖ అధ్యక్షుడు రాయం రంజిత్, వెంకటరావుపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు కస్తూరి రాజిరెడ్డి, మద్దికుంట గ్రామ శాఖ అధ్యక్షుడు దొరుకుల కొండయ్య, కొండాపూర్ గ్రామ శాఖ అధ్యక్షుడు గాంత రాజు, రామ్రెడ్డిపల్లి గ్రామ శాఖ అధ్యక్షుడు సంఘం ఎల్లం, మండల కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వంగమోహన్ రెడ్డి, కార్యదర్శి శీలం రాజనర్సు, మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు కొమురయ్య, సీనియర్ నాయకులు వేలుముల రాంరెడ్డి,వుచ్చిడి బాల్రెడ్డి,తుపాకుల శ్రీనివాస్ గౌడ్,అరుట్ల మహేష్ రెడ్డి, జంగేటి బాలరాజ్, కదిరే సత్యం గౌడ్,కొండాపూర్ భరత్,రామ్ రెడ్డిపల్లి రమేష్,నవీన్,బోయ నర్సింహులు, పొన్నం రాజయ్య, రాకేష్ రెడ్డి, రమేష్ నాయక్ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

ప్రభాస్, హను రాఘవపూడి కాంబోలో వచ్చే సినిమాలో హీరోయిన్ గా హాలీవుడ్ బ్యూటీ…