Hyderabad Radisson Drug Party : హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ కేసులో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు
TeluguStop.com
హైదరాబాద్ రాడిసన్ డ్రగ్స్ పార్టీ( Hyderabad Radisson Drug Party ) కేసులో గచ్చిబౌలి పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
విచారణలో భాగంగా లిషిత ఇంటికి పోలీసులు అంటించిన నోటీసులపై ఆమె సోదరి కుషిత సమాధానం ఇచ్చారు.
"""/" / ఈ మేరకు లాయర్ తో పాటు పోలీస్ స్టేషన్ కు వచ్చిన కుషిత( Kushitha ) పోలీసుల నోటీసులకు రిప్లై ఇచ్చారు.
లిషిత ఇంట్లో లేదని, వచ్చాక పంపిస్తామని కుషిత అధికారులకు తెలిపారని తెలుస్తోంది.అలాగే లిషిత( Lishitha ) కనపడటం లేదంటూ ఆమె సోదరి ఫిర్యాదు చేశారు.
డ్రగ్స్ కేసు తెరపైకి వచ్చినప్పటి నుంచి లిషిత కనపడటం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.
లిషిత విచారణకు కచ్చితంగా రావాలని పోలీసులు చెప్పారని సమాచారం.