సినీ నటుడికి యాక్సిడెంట్.. పవన్ సాయం అందించాలంటున్న అభిమానులు
TeluguStop.com
ఎన్నో చిత్రాల్లో నటించడంతో పాటు, పలు స్టేజ్ షోలు చేసిన నటుడు ఆంజనేయులు అతడి భార్యతో బైక్‌పై వెళ్తున్న సమయంలో యాక్సిడెంట్‌కు గురయ్యాడు.
కృష్ణానగర్‌కు సమీపంలో ఈ యాక్సిడెంట్ జరిగింది.అయితే అదృష్టవశాత్తు ఆంజనేయులు గాయాలతో బయట పడ్డాడు.
కారు వెనుక నుండి వచ్చి గుద్దిన కారణంగా బైక్ పై వెళ్తున్న ఆంజనేయులు మరియు ఆయన భార్య ఇద్దరు కూడా కింద పడ్డారు.
ఈ ప్రమాదంలో ఆంజనేయులు భార్యకు కూడా గాయాలు అయ్యాయి.గబ్బర్ సింగ్‌లో అంత్యక్షరి ఎపిసోడ్‌తో ఆంజనేయులు మంచి గుర్తింపు దక్కించుకున్నాడు.
ముఖ్యంగా రాజశేఖర్ నటించిన రోజ్ రోజ్ పాటను ఇతడు ఇమిటేట్ చేసి అందరిని అలరించాడు.
గబ్బర్ సింగ్ తర్వాత ఎన్నో సినిమాల్లో ఆంజనేయులు అలరించాడు.ముఖ్యంగా రాజశేఖర్ ను ఇమిటేట్ చేయడంలో ఇతడు ముందు ఉంటాడు.
ఎన్నో స్టేజ్ షోలపై కామెడీని పండించిన ఇతడు యాక్సిడెంట్‌కు గురి అవ్వడంతో కుటుంబం రోడ్డున పడ్డట్లు అయ్యింది.
Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;"img Src="https://telugustop!--com/wp-content/uploads/2019/04/gabbarsingh-actor-anjaneyulu-injured-సినీ-నటుడికి-యాక్సి1!--jpg"/
గబ్బర్ సింగ్‌తో గుర్తింపును దక్కించుకున్న వారు అంతా కూడా పవన్‌కు ఎప్పుడు కూడా వెన్నంటి ఉంటారు.
ఎప్పుడు పవన్‌కు మద్దతుగా నిలుస్తూ ఉంటారు.వారిలో ఆంజనేయులు కూడా ఉంటాడు.
అందుకే ఇప్పుడు ఆంజనేయులుకు పవన్ కళ్యాణ్ సాయం చేయాలని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ఈ సమయంలో షూటింగ్స్‌కు వెళ్లకుండా ఆంజనేయులు ఉంటే అతడి కుటుంబం గడవడం కష్టం.
అందుకే సినిమా పరిశ్రమ వారు ఆదుకోవాలని ఆయన సన్నిహితులు అంటున్నారు.