Gami, Bheema : గామి, భీమా ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలు ఇవే.. విశ్వక్ సేన్ సినిమాకే మూడు రెట్లు ఎక్కువంటూ?

మహా శివరాత్రి పండుగ సందర్భంగా గామి, భీమా( Gami, Bheema ) సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.

గామి సినిమాకు 9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా భీమా సినిమాకు 3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

విశ్వక్ సేన్( Vishwak Sen ) సినిమాకే మూడు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గామి సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ప్లస్ అయింది.క్రౌడ్ ఫండ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే క్వాలిటీతో ఈ సినిమా తెరకెక్కింది.

గామి సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయనే సంగతి తెలిసిందే.

గామి సినిమా కోసం విశ్వక్ సేన్ ఎంతో కష్టపడ్డారు.ఐదేళ్ల పాటు గామి సినిమా షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.

"""/" / విశ్వక్ సేన్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని చెప్పవచ్చు.

10 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరగడంతో ఫస్ట్ వీకెండ్ సమయానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.

గామి సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది. """/" / విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs Of Godavari ) వచ్చే నెలలో విడుదల కానుంది.

సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు.

రాబోయే రోజుల్లో విశ్వక్ సేన్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

నైజాంలో ఆ రికార్డ్ క్రియేట్ చేయనున్న పుష్ప ది రూల్.. బన్నీ క్రేజ్ కు ప్రూఫ్ ఇదే!