తీన్మార్ మల్లన్నకు జి.యడవెళ్లి భూ బాధితుల వినతి
TeluguStop.com
నల్లగొండ జిల్లా:గత ప్రభుత్వాలు నిరుపేదలైన ఎస్సి,ఎస్టీ,బీసీలకు పట్టాలు ఇచ్చిన భూములను టీఆర్ఎస్ ప్రభుత్వం బలవంతంగా లాక్కొని రైతులను ఇబ్బందులకు గురి చేస్తుందని,ఎన్ని రకాలుగా నిరసన ప్రదర్శనలు చేసినా,ఎంత మంది ప్రజా ప్రతినిధులను,
అధికారులను కలిసి విన్నవించినా తమ గోడు పట్టించుకునే నాథుడు లేడని,దిక్కుతోచని స్థితిలో ఆదివారం హైదరాబాద్ క్యూ న్యూస్ ఆఫీస్ లో తీన్మార్ మల్లన్నను కలసి వినతిపత్రం అందజేసినట్లు
నల్గొండ జిల్లా బీసీ సంక్షేమ సంఘం యూత్ అసోసియేషన్ సెక్రటరీ గడ్డం ధర్మేందర్ తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలను నిరంతరం ప్రశ్నిస్తున్న ప్రజా గొంతుక తీన్మార్ మల్లన్నను కలిసి తమ సమస్య గురించి విన్నవించామని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం వివిధ పథకాల పేరుతో రైతుల నుంచి ప్రభుత్వ భూములను బలవంతంగా లాక్కొని వారిని రోడ్డున పడేస్తున్న ఘటనలు రాష్ట్రంలో నిత్యం కోకొల్లలుగా వెలుగులోకి వస్తూనే ఉన్నాయన్నారు.
అందులో భాగంగా నల్లగొండ జిల్లా కనగల్ మండలం జి.యడవెళ్లి గ్రామంలో పల్లె ప్రగతి పేరుతో ఏళ్ల నుండి పట్టాలు కలిగి,సాగు చేసుకుంటున్న భూములను అక్రమంగా గొంజుకొని
రోడ్డున పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నిసార్లు కింది స్థాయి అధికారుల నుండి జిల్లా కలెక్టర్ వరకు మొర పెట్టుకున్నా ఎవ్వరూ తమను పట్టించుకువడం లేదని,ప్రజా ప్రతినిధులైతే ఇటుదిక్కు చూసిన పాపాన పోవడం లేదని వాపోయారు.
జి.యడవల్లి రైతుల సమస్యల గురించి చెప్పగానే స్పందించిన మల్లన్న న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని, రైతుల కోసం తప్పకుండా సహకారం ఉంటుందని,మీ బాధను ప్రభుత్వానికి చేరేలా క్యూ న్యూస్ ప్రయత్నం చేస్తుందని తెలిపారని అన్నారు.
సంక్రాంతికి లో బడ్జెట్ సినిమాలే హిట్.. హనుమాన్, సంక్రాంతికి వస్తున్నాం ప్రూవ్ చేసిందిదే!