జీ -20 డిన్నర్ ఆహ్వాన పత్రికపై దుమారం..!

జీ-20 డిన్నర్ ఆహ్వాన పత్రికపై తీవ్ర దుమారం చెలరేగుతోంది.ఆహ్వాన పత్రికలో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించి ఉండటం వివాదానికి దారి తీసిందని తెలుస్తోంది.

ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు బదులుగా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించారని సమాచారం.

ఈ క్రమంలో రాష్ట్రపతి భవన్ ఇన్విటేషన్ పై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం లేవనెత్తింది.

ఈ నేపథ్యంలోనే ఇండియాను భారత్ గా మార్చారంటూ జైరాం రమేశ్ ట్వీట్ చేశారని తెలుస్తోంది.

దీంతో ఈ వ్యవహారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.కాగా ఢిల్లీ వేదికగా జరగబోతున్న జీ 20 సదస్సు నేపథ్యంలో దేశ రాజధానిలో ఇప్పటికే సర్వం సిద్ధం అయ్యాయని తెలుస్తోంది.

అధ్యక్ష బాధ్యతల్లో ఉన్న భారత్ శిఖరాగ్ర సదస్సు కోసం అన్ని ఏర్పాట్లను చేస్తోంది.

రాజకీయ ఎంట్రీ పై ఫుల్ క్లారిటీ ఇచ్చిన మంచు మనోజ్… ఏమన్నారంటే?