భవిష్యత్ సంస్కరణలు తీసుకురానున్నాం..: నిర్మలా సీతారామన్

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు( Parliament Budget Sessions ) కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్( Central Finance Minister Nirmala Sitharaman ) డిజిటల్ విధానంలో మధ్యంతర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.

వచ్చే ఐదేళ్లలో ఊహించని రీతిలో అభివృద్ధి జరుగుతుందని, ఈ క్రమంలో స్వర్ణయుగం కానుందని నిర్మలా సీతారామన్ తెలిపారు.

భవిష్యత్ సంస్కరణలు తీసుకురానున్నామన్నారు.రాష్ట్రాల్లోనే కాకుండా జిల్లాల్లో కూడా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి కేంద్రం పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో( Rural Areas ) మూడు కోట్ల గృహ నిర్మాణాన్ని సాధించామన్నారు.

వచ్చే రెండేళ్లలో మరో రెండు కోట్ల గృహ నిర్మాణాలు అందిస్తామని చెప్పారు.కోటి ఇళ్లలో సౌర విద్యుత్( Solar Energy ) ద్వారా రెండు వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్నామన్నారు.

"""/" / మధ్య తరగతి ప్రజలు సొంత నివాసం నిర్మించుకునేందుకు సాయం అందిస్తామన్న నిర్మలా సీతారామన్ 9 నుంచి 14 లోపు బాలికలకు వ్యాక్సినేషన్ ద్వారా గర్భాశయ క్యాన్సర్ నివారణకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

నానో యూరియా విజయవంతం కావడంతో నానో డీఏపీ వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.

కొండపైకి ఎక్కుతూ జారిన మహిళ.. చివరకు? (వీడియో)