ఫన్నీ వీడియో: తన యజమాని ఫర్ ఫ్రొం హోమ్ ను చేసుకునివ్వకుండా ఎలా చేస్తుందంటే..?!
TeluguStop.com
ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ప్రజలు అందరూ కూడా ఇళ్లకే పరిమితమైపోయి వారి ఉద్యోగానికి సంబందించిన పనులు ఇంట్లో ఉండి చేసుకుంటూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
అయితే ఎక్కువగా కరోనా వ్యాప్తికి కారణం చేత చాలా కంపెనీలు అవకాశాన్ని కల్పించిన సంగతి అందరికి విదితమే దీంతో చాలా మంది ఉద్యోగులు వారి ఇంట్లోనే ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యంతో వారి ఆఫీస్ పనులను పూర్తి చేసుకుంటున్నారు.
అయితే తాజాగా ఒక వ్యక్తి తన విధులు నిర్వహించేందుకు సిద్ధమవుతున్న వేళ అది నచ్చని అతని పెంపుడు కుక్క అనేక రకాల అడ్డుకుంది.
ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతున్నాయి.
మామూలుగా చాలా మంది వారి కుక్కలను ఇంట్లో పెంచుకోవడం, వాటిని వారి కుటుంబంలో ఒకరిగా చూసుకోవడం దాని ఆలనా పాలనా మొత్తం వారే చూసుకుంటూ ఉంటారు.
అంతేకాకుండా ఆ కుక్కలు కూడా వారి యజమానుల పట్ల అంతే ప్రేమతో ఉంటాయి.
యజమానికి ఎలాంటి ఆపద వచ్చినా, అవసరం వచ్చినా అండగా ఉండడంలో కుక్కకు సాటి ఎవరూ లేరని చెప్పాలి.
యజమానితో సమయం గడిపేందుకు ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూ ఉండటం మనం చూస్తూనే ఉంటాం అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కారణం చేత ఇళ్లలో ఉండే పని చేసుకునే ఒక వ్యక్తి ఇంట్లో ల్యాప్ టాప్ పని ప్రారంబించేందుకు ప్రయత్నంలో భాగంగా, తన పెంపుడు కుక్క అతను ల్యాప్ టాప్ ఓపెన్ చేయకుండా అడ్డుపడింది.
"""/"/
అంతే కాకుండా ఆ వ్యక్తి ల్యాప్ టాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి కుక్క దాని మూసివేయడం, అలా కొంత సమయం పాటు ఆ కుక్క తన యజమాని ఆట పట్టించండి ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా చక్కర్లు కొడుతుంది.
ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోను చూసి ఎంజాయ్ చేయండి.