ఫన్నీ వీడియో : కూతురికి కొత్తగా స్కూటీ నేర్పించాలి అనుకున్నాడు.. తీరా చూస్తే ఫ్యూజులు ఎగిరిపోయే షాక్ ఇచ్చింది..
TeluguStop.com
సాధారణంగా తండ్రులు తమ కొడుకుల కంటే కూతుళ్లపైనే ఎక్కువగా ప్రేమ కురిపిస్తుంటారు.వారి ఆనందమే తమ ఆనందం అని భావిస్తూ ఏం చేయడానికైనా రెడీ అయిపోతుంటారు.
వారికి మంచి ఫ్రెండ్ గా ఉంటూ అన్ని విషయాల్లోనూ దగ్గరుండి సహాయం చేస్తారు.
అలాగే అడిగిందల్లా కొనిస్తారు.సింపుల్ గా చెప్పాలంటే కూతుర్లు డాడీకి ఒక లిటిల్ ప్రిన్సెస్ లాంటోళ్లు! అయితే ఒక్కోసారి కూతుర్లు చేసే పనులు తండ్రులకి షాక్ ఇస్తుంటాయి.
ఇవి భలే ఫన్నీగా ఉంటాయి.తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో వైరల్ అవుతోంది.
దీనిని చూసిన నెటిజన్లు తెగ నవ్వు కుంటున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక తండ్రి తన కూతురుకు కొత్తగా స్కూటీ నేర్పించడం గమనించవచ్చు.
అది ఎలా నడపాలో నేర్పించిన తర్వాత ఆ తండ్రి తన ఇంట్లో కూతురిని స్కూటీ నడపాలని సూచించాడు.
కూతురు కూడా స్కూటీ నడపాలని బాగా తాపత్రయంతో ఉన్నట్లు కనిపిస్తోంది.ఆ తర్వాత తండ్రి "హా, రెడీ గో" అనగానే కూతురు స్టాండ్ కూడా తీయకుండానే యాక్సిలరేటర్ గట్టిగా తిప్పింది.
అయితే కూతురికి బ్యాలెన్స్ ఎలా చేయాలో కూడా తెలియదేమో పాపం! అందుకే స్కూటీ ని కంట్రోల్ చేయ లేక ఏకంగా తండ్రికి డాష్ ఇచ్చింది.
తాను కూడా కిందపడి పోయింది.ఈ పాపకి మోకాలికి దెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.
దీంతో అబ్బ అంటూనే తన తండ్రికి ఏదైనా అయ్యిందే మోనని చాలా దయ నీయంగా ఒక లుక్ ఇచ్చింది.
అయితే ఇది ఊహించని తండ్రికి ఏకంగా ఫ్యూజులు ఎగిరి పోయేంత పని అయింది.
దాంతో అనవసరంగా స్కూటీ నేర్పించానని తనని తనే తిట్టు కుంటున్నట్లుగా బాడీ లాంగ్వేజిని బట్టి చూస్తుంటే అర్థం అవుతోంది.
ఈ వీడియోని పాప సోదరుడు తన కెమెరాలో బంధించాడు.అనంతరం దీనికి సోషల్ మీడియాలో షేర్ చేయగా ఇది వైరల్ అవుతోంది.
"ఈ డాడీస్ లిటిల్ ప్రిన్సెస్.ఇలా షాకిచ్చింది ఏంటి? వామ్మో ఏకంగా మర్డర్ అటెంప్ట్ చేసిందిగా.
ఇంకా నయం ట్రాఫిక్‌లో అమ్మాయికి స్కూటీ ఇవ్వలేదు!" అని నెటిజన్లు రక రకాలుగా ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.
ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్కేయండి.
అనారోగ్యాన్ని ఎదిరించి 508 కి.మీ నడక .. యువతకు స్పూర్తిగా నిలిచిన వాకింగ్ సింగ్