నువ్వు హీరోయినా.. నేనుప్పుడూ చూడలేదే.. స్టార్ హీరోయిన్ కు షాక్ ఇచ్చిన మహిళ?

సాధారణంగా సినిమావాళ్లు అన్న తర్వాత దాదాపు అందరికీ తెలిసే ఉంటుంది.అలాగని అందరికీ తెలియాలి అన్న ఇది కూడా లేదు.

ఎందుకంటే సినిమా ప్రపంచానికి దూరంగా.దూరం అంటే అంతా ఇంత కాదు ఏకంగా సినిమా వాళ్ళు కనిపించిన గుర్తుపట్టనంత దూరం గా కొంతమంది జీవిస్తూ ఉంటారు.

వాళ్లను చూసి అయ్యో పాపం అనుకునేరూ.ఎందుకంటే సినిమాలు చూడకపోతే నేమ్ వాళ్లు ఎంతో సంతోషంగానే ఉంటారు అని చెప్పాలి.

ఇంతకీ ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చింది అనే కదా మీ డౌట్.

ఇదంతా చెప్పుకోవడానికి కారణం స్టార్ హీరోయిన్ భానుప్రియ కెరియర్ లో జరిగిన ఒక ఆసక్తికర ఘటన గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి.

అప్పట్లో అందం అభినయానికి కేరాఫ్ అడ్రస్ గా ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది భానుప్రియ.

స్టార్ హీరోయిన్ గా హవా అనిపించింది.అప్పటికే సితార, అన్వేషణ లాంటి సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలిగా మారింది.

అయితే ఇక భానుప్రియ ఆలాపన అనే సినిమాలో నటిస్తోంది.దీనికి దర్శకుడు వంశీ.

అయితే అంతకుముందు నటించిన సినిమాలకు కూడా దర్శకుడు అతనే.బొర్రా గుహలు, అరకు లోయలు, టన్నెల్ రైలు మార్గాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎక్కడపడితే అక్కడ షూటింగులు చేస్తూనే ఉన్నారు.

ఇలాగే ఓ రోజు షూటింగ్ చేస్తూ ఇక చిత్ర బృందం చిమిడి పల్లి అనే రైల్వే స్టేషన్కు చేరుకున్నారు.

ఇక భానుప్రియ తో పాటు ఆమె చెల్లి శాంతి ప్రియ కూడా ఉన్నారు.

అక్కడికి చేరుకున్నాక కనుచూపు మేరలో మనిషన్నవాడు కనిపించకుండా పోయాడు.స్టేషన్ లో ఉన్న సిబ్బంది తప్ప ఎవరూ కనిపించలేదు.

అంతలోనే వర్షం ఇక భానుప్రియ డ్రెస్ మొత్తం తడిచిపోయింది.దీంతో ఏం చేయాలో పాలుపోక ఇక స్టేషన్ మాస్టర్ శివరాజు ఇంట్లోకి వెళ్లింది.

ఎంతో ప్రేమగా పలకరించింది భానుప్రియ.ఇక ఆ తర్వాత శివ రాజు భార్య లీలా ఉప్మా చేస్తాను తింటారా అని అడిగింది.

చాలా ఆకలిగా ఉంది ఎందుకు తినను అని చెప్పారు.ఆ తర్వాత ఏదైనా ఉతికిన చీర ఉంటే ఇవ్వండి ఇక్కడ నుంచి వెళ్లేటప్పుడు ఇస్తాను అంటూ చెప్పింది బానుప్రియ.

"""/"/ అంతలోనే ఉండబట్టలేక నా సినిమాలు మీరు ఏమేమి చూసారు అని అడిగింది భానుప్రియ.

సినిమాలేంటి అని సమాధానం చెప్పింది శివరాజు భార్య లీల.అదేంటి నేను సినిమా హీరోయిన్ తెలుసా అంటూ చెప్పేసింది.

భానుప్రియ ను చూసిన లీల ఒక నవ్వు నవ్వింది.మేము ఎవరో తెలియకుండా ఇంత సేవ చేస్తున్నారు ఎందుకు అంటూ అడిగింది భానుప్రియ.

ఇన్నాళ్ల పాటు ప్రేమగా పలకరించే వారే లేకుండాపోయారు.మీరు అలా పలకరించే సరికి సొంత వాళ్లలా అనిపించారు అందుకే సేవ చేస్తున్నాను అంటు చెప్పింది స్టేషన్ మాస్టర్ శివ రాజు భార్య లీల.

ఇక ఆ తర్వాత షాట్ సమయం అయింది.దీంతో ఆమె ఇచ్చిన చీర విప్పి మళ్ళీ కాస్ట్యూమ్ వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయింది భానుప్రియ.

భానుప్రియ కెరియర్ లో జరిగిన ఈ ఆసక్తికర సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.

బాలయ్యకు పద్మభూషణ్…. శుభాకాంక్షలు చెప్పిన అల్లు అర్జున్?