బయటకొచ్చిన ఫన్ బకెట్ భార్గవ్.. దుమ్ముదులుపుతున్న నెటిజెన్లు!

కొన్ని రోజుల కిందట ఫన్ బకెట్ భార్గవ్ ఓ మైనర్ బాలికను లొంగదీసుకొని ఆమెను గర్భవతిని చేసిన సంగతి తెలిసిందే.

దీంతో అతనిని పోలీసులు అరెస్టు చేయగా దేశం మొత్తం ఫన్ బకెట్ భార్గవ్ పై ఓ రేంజ్ లో మండిపడింది.

కొన్ని రోజులు జైలు లో ఉన్న భార్గవ్ తాజాగా బయటకు వచ్చినట్లు తెలుస్తుంది.

ఇక ఇతనిపై నెటిజన్లు ఓ రేంజ్ లో దుమ్ము దులుపుతున్నారు.సోషల్ మీడియాలో టిక్ టాక్ వీడియోలు చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు భార్గవ్.

అంతేకాకుండా యూట్యూబ్ లో ఫన్ బకెట్ పేరుతో కొంత మంది అమ్మాయిలతో కూడా వీడియోలు చేసేవాడు.

దీంతో అతి తక్కువ సమయంలో మంచి ఫాలోయింగ్ కూడా సంపాదించుకున్నాడు భార్గవ్.కానీ అంతే త్వరగా తన పేరును కోల్పోయాడు.

ఇక ఈయనకు టిక్ టాక్ లో 14 ఏళ్ల మైనర్ బాలిక పరిచయం కావడంతో తనకు మరింత పేరు అందిస్తానని చెప్పి నమ్మించాడు.

"""/"/ ఆమెను ప్రేమిస్తున్నానని ప్రపోజ్ చేయగా ఆ బాలిక నో అనడంతో చెల్లి అని పిలిచేవాడని తెలిసింది.

దీంతో ఆమె దుస్తులు మార్చుకునే సమయంలో వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేసి పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.

ఇక ఇతడిపై ఏప్రిల్ 16న దిశ, పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు.

ఇక బాధితురాలు గురించి ఎటువంటి ఆధారాలు కూడా బయట పెట్టలేదు పోలీసులు.అలా కొన్ని రోజులు జైల్లో ఉన్న భార్గవ్ తాజాగా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఓ పోస్ట్ పెట్టాడు.

అందులో నేను మళ్ళీ వస్తున్నాను.అంతే కాదు మీ సపోర్టు కావాలని కోరాడు.

ఇక ఈ పోస్ట్ ను చూసిన నెటిజన్లు ఓ రేంజ్ లో మండిపడుతున్నారు.

మళ్లీ ఎందుకు వచ్చావని, ఎవరి సపోర్టు కావాలని అడుగుతున్నావ్ అని నోటికొచ్చిన మాటలతో కామెంట్స్ చేస్తున్నారు.

వైరల్ పోస్ట్: పెళ్ళికి ముందే అసలు విషయం కనిపెట్టిస్తున్నట్టున్నాడు ఈ తమ్ముడు.. కావాలంటే పోస్ట్ చూడండి..