చిట్లిన జుట్టుకు చెక్ పెట్టే ఫుల్లర్స్ ఎర్త్..ఎలా వాడాలంటే?

చిట్లిన జుట్టు ఎంత అందవిహీనంగా క‌నిపిస్తుందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.పోష‌కాల లోపం, మారిన జీవ‌న‌శైలి, కాలుష్యం, స‌రైన హెయిర్ కేర్ లేక‌పోవ‌డం, కెమిక‌ల్స్ ఎక్కువ‌గా ఉండే షాంపూల వాడ‌కం, హీటింగ్ ప్రొడక్ట్స్ యూజ్ చేయ‌డం ఇలా ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల జుట్టు చిట్లిపోతూ ఉంటుంది.

దాంతో చిట్లిన జుట్టును నివారించుకునేందుకు ఎన్నెన్నో పాట్లు ప‌డుతుంటారు.అయితే ఈ స‌మ‌స్య‌కు చెక్ పెట్ట‌డంలో ఫుల్ల‌ర్స్ ఎర్త్ (ముల్తానీ మ‌ట్టి) అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది.

మ‌రి దీనిని కేశాల‌కు ఎలా ఉప‌యోగించాలో ఇప్పుడు తెలుసుకుందాం.ముందు ఒక బౌల్ తీసుకుని అందులో ఫుల్ల‌ర్స్ ఎర్త్‌, పాలు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్ర‌మాన్ని త‌ల‌కు, కేశాల‌కు ప‌ట్టించి.అర గంట పాటు డ్రై అవ్వ‌నివ్వాలి.

అనంత‌రం కెమిక‌ల్స్ త‌క్కువ‌గా ఉండే షాంపూ యూజ్ చేసి గోరు వెచ్చ‌ని నీటితో త‌ల‌స్నానం చేయాలి.

ఇలా వారానికి రెండు సార్లు చేస్తే.చిట్లిన జుట్టు మ‌ళ్లీ మామూలుగా మారుతుంది.

అలాగే ఒక బౌల్‌లో ఫుల్ల‌ర్స్ ఎర్త్ మ‌రియు ఎగ్ వైట్ తీసుకుని క‌లుపుకోవాలి.

"""/" / ఆ త‌ర్వాత కేశాల‌కు ఈ మిశ్ర‌మాన్ని ప‌ట్టించి.అర గంట లేద గంట పాటు వ‌దిలేయాలి.

అనంత‌రం త‌ల స్నానం చేసేయాలి.ఇలా మూడు రోజుల‌కు ఒక సారి చేసినా చిట్లిన జుట్టు న‌యం అవుతుంది.

మ‌రియు జుట్టు ఒత్తుగా, పొడ‌వుగా పెరుగుతుంది.ఇక ఫుల్ల‌ర్స్ ఎర్త్ చుండ్రుకు చెక్ పెట్ట‌డంలోనూ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

ఫుల్ల‌ర్స్ ఎర్త్‌, నిమ్మ ర‌సం మ‌రియు క‌ల‌బంద జెల్ వేసి మిక్స్ చేసుకుని.

త‌ల‌కు, జుట్టుకు బాగా ప‌ట్టించాలి.ఇర‌వై, ముప్పై నిమిషాల అనంత‌రం హెడ్ బాత్ చేయాలి.

ఇలా వీక్లీ ట్వైస్‌ చేస్తే చుండ్రు స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం పొందొచ్చు.