ప్రయాణికులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్.. ముంబై లోకల్‌ ట్రైన్‌లో ట్రాన్స్‌వుమన్ మిమిక్రీ అదుర్స్..

లోకల్ ట్రైన్లు అనేవి ముంబై(mumbai) నగరపు గుండె చప్పుడు అని చెప్పుకోవచ్చు.లక్షలాది మంది ప్రయాణికులతో నిత్యం కిటకిటలాడే ఈ రైళ్లు, ముంబై వాసుల జీవితంలో ఒక భాగం అయిపోయాయి.

కలలు కంటూ దేశం నలుమూలల నుంచి ముంబైకి వచ్చే ఎంతో మందికి ఇవే ఊపిరి.

ఈ నగరపు ఉరుకుల పరుగుల జీవితంలో, రైళ్లలో రోజూ కొత్త వింతలు, విశేషాలు చోటు చేసుకుంటూనే ఉంటాయి.

ముఖ్యంగా లేడీస్ కంపార్ట్‌మెంట్(Ladies Compartment), ఇది ఎన్నో భావోద్వేగాల సమ్మేళనం.చిన్న చిన్న గొడవలు, కబుర్లు, నవ్వులు, స్నేహాలు అన్నీ ఇక్కడ చోటు చేసుకుంటాయి.

సరిగ్గా ఇలాంటి ఒక లేడీస్ కోచ్ వీడియోనే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందులో ఒక ట్రాన్స్‌జెండర్(transgender) మహిళ తన మిమిక్రీ మాటలతో అందరినీ కడుపుబ్బా నవ్విస్తూ, నెటిజన్ల మనసు దోచుకుంటున్నారు.

"""/" / ఈ ట్రాన్స్‌జెండర్ మహిళ రైలు (Transgender ,womans)ప్రయాణాన్ని ఫ్లైట్ జర్నీలా మార్చేశారు.

ముంబై లోకల్ ట్రైన్ లేడీస్ కంపార్ట్‌మెంట్‌లో ఆమె చేసిన సందడి అంతా ఇంతా కాదు.

ఫ్లైట్ అటెండెంట్ల స్టైల్‌లో అనౌన్స్‌మెంట్ చేస్తూ అందరినీ నవ్వించారు."హలో, రైలుకి స్వాగతం! మన రైలు ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్‌కి (Chhatrapati Shivaji Maharaj Terminus)బయలుదేరుతోంది.

కాబట్టి, దయచేసి మీ సీట్ బెల్ట్‌లు బిగించుకోండి" అంటూ మొదలుపెట్టారు.ఆ తర్వాత అసలు ట్విస్ట్ ఇచ్చారు.

"మీరు టికెట్‌పై పెట్టిన డబ్బులు ఇప్పుడు పోయింది.కాబట్టి దయచేసి దిగేయండి.

అనౌన్స్‌మెంట్ ఇంతే.ధన్యవాదాలు!" అని ఫన్నీగా ముగించారు.

"""/" / ఆమె టైమింగ్, పంచ్‌లు ప్రయాణికులను కడుపుబ్బా నవ్వించాయి.ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో నెటిజన్లు కూడా ఫిదా అయిపోయారు.

ఈ ట్రాన్స్‌వుమన్ మిమిక్రీ అదుర్స్ అంటూ కామెంట్లు చేస్తున్నారు.రోటీన్ లైఫ్‌లో కాస్తంత కామెడీ, క్రియేటివిటీ ఉంటే ఎలా ఉంటుందో ఈ వీడియో చక్కగా చూపిస్తోంది.

ఇలాంటి చిన్న చిన్న విషయాలే మన రోజువారీ జీవితానికి కొత్త ఉత్సాహాన్నిస్తాయి, మర్చిపోలేని జ్ఞాపకాలను మిగులుస్తాయని చెప్పుకోవచ్చు.

ఢిల్లీ లో బాబు బిజీ బిజీ.. వీరందరితోనూ భేటీ