హర్షసాయి సహాయాలు నిజమా? ఫేకా? అన్ని ప్రశ్నలకు జవాబులు ఇవే!
TeluguStop.com
ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి యూట్యూబ్ లో తన వీడియోల ద్వారా ఎంతోమందికి దగ్గరయ్యారు.
కష్టాల్లో ఉన్న ఎంతోమందికి సహాయం చేసి ఆ సహాయాల ద్వారా హర్షసాయి వార్తల్లో నిలిచారు.
అయితే హర్షసాయి మంచి పనులే చేస్తున్నప్పటికీ కొంతమంది మాత్రం యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఆయనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు.
హర్షసాయి సేవలు నకిలీ సేవలు అని ప్రచారం చేస్తున్నారు.ఈ ప్రచారం వల్ల కొంతమంది హర్షసాయి గురించి తప్పుగా అర్థం చేసుకున్నారు.
అయితే యాంకర్ జాఫర్ హర్షసాయి సహాయాలు చేసిన వ్యక్తులను డైరెక్ట్ గా కలవడంతో పాటు హర్షసాయితో ఇంటర్వ్యూ చేసి వాస్తవాలను వెలుగులోకి తెచ్చారు.
హర్షసాయి చేసినా సహాయాలన్నీ నిజమేనని అందులో ఎలాంటి మోసం చేయలేదని ఆయన సాయం పొందిన వాళ్లు వెల్లడించారు.
యూట్యూబ్ వీడియోలలో చెప్పిన వ్యక్తులే కాకుండా ఎంతోమంది హర్షసాయి ద్వారా సాయం పొందారు.
యూట్యూబ్ ఛానల్ ద్వారా, సోషల్ మీడియా ప్రమోషన్స్ ద్వారా తనకు డబ్బు వస్తోందని ఆ డబ్బునే నేను ఖర్చు చేస్తున్నానని హర్షసాయి అన్నారు.
నాకు రాజకీయాలపై ఎలాంటి ఆసక్తి లేదని హర్షసాయి కామెంట్లు చేశారు. """/" /నేను చేసిన వీడియోల ద్వారా ఇతరులు స్పూర్తి పొందితే చాలని హర్షసాయి పేర్కొన్నారు.
8 సంవత్సరాల వయస్సులోనే అమ్మ చనిపోయారని హర్షసాయి అన్నారు.నా టాలెంట్ వల్లే వీడియో వైరల్ అవుతోందని హర్షసాయి చెప్పుకొచ్చారు.
నా వీడియోలు చూసి కొంతమంది స్పూర్తి పొందినా అది సక్సెస్ అని హర్షసాయి అన్నారు.
ముందే సర్వే చేసి అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే సహాయం చేస్తానని హర్షసాయి వెల్లడించారు.
ఆఫ్ స్క్రీన్ లో చేసిన సహాయాల గురించి మాట్లాడుకున్నా వేస్ట్ అని ఆయన తెలిపారు.
నా లైఫ్ కు ఒక పర్పస్ ఉండాలని నేను భావించేవాడినని హర్షసాయి పేర్కొన్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీక్వెల్స్ కు భారీ స్థాయిలో క్రేజ్.. ఈ సీక్వెల్స్ హిట్టవుతాయా?