హరీష్ రావుపైనే పూర్తి భారం... కేసీఆర్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా?

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో హరీష్ రావు పరిచయం అక్కరలేని పేరు.ట్రబుల్ షూటర్ అనే పేరున్న ఒకే ఒక్క నాయకుడు మంత్రి హరీష్ రావు.

టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు క్లిష్ట తరమైన పరిస్థితులు వచ్చినా అక్కడ తనదైన వ్యూహాలతో, రాజకీయ చతురతతో టీఆర్ఎస్ పార్టీని ఒంటి చేత్తో గెలిపించి కెసీఆర్ కు విజయాన్ని బహుమతిగా ఇచ్చిన సందర్భాలు చాలా వరకు ఉన్నాయి.

అందుకే ఎప్పుడు ఎక్కడ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో కీలకమైన స్థానాల్లో గెలవాలి అనుకున్నప్పుడు అక్కడ హరీశ్ రావుకు పగ్గాలు అప్పగిస్తుంటారు కెసీఆర్.

ప్రస్తుతం టీఆర్ఎస్  కీలకంగా గెలవాల్సిన నియోజకవర్గం హుజూరాబాద్.ఎందుకు కీలకం అని ఒకసారి మనం విశ్లేషించుకుంటే గత 20 సంవత్సరాల నుండి హుజూరాబాద్ అనేది టీఆర్ఎస్ పార్టీకి కంచుకోట.

హుజూరాబాద్ లాంటి కీలక నియోజకవర్గాలు టీఆర్ఎస్ కు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాలు ఉన్నాయి.

ఆ కీలక నియోజకవర్గాలలో టీఆర్ఎస్ ఓటమి పాలైతే ప్రజల్లోకి టీఆర్ఎస్ పార్టీపై తప్పుడు సంకేతాలు వెళ్ళే పరిస్థితి ఉంది.

కాబట్టి హుజూరాబాద్ విజయాన్ని కెసీఆర్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది.అందుకే హరీశ్ రావుకు కీలక బాధ్యతలు అప్పగించి విజయంపై నమ్మకంగా ఉన్న పరిస్థితి ఉంది.

అయితే ఇప్పటికే  క్షేత్ర స్థాయిలో రకరకాల సంఘాలతో సమావేశమైన హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ రెగ్యులర్ ఓటు బ్యాంకును కాపాడుకుంటూనే దళిత ఓటు బ్యాంకుపై పెద్ద ఎత్తున నమ్మకంగా ఉన్న పరిస్థితి ఉంది.

ఎందుకంటే బీజేపీ నేతలు మంద కృష్ణ మాదిగతో సమావేశమవుతూ దళితుల ఓట్లపై కన్నేసిన పరిస్థితి ఉంది.

ఎందుకంటే హుజూరాబాద్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు నలభై వేలకు పైగా ఉన్న తరుణంలో దళితుల మద్దతు ఉన్న పార్టీకనే ఎన్నికలో గెలిచే అవకాశం ఉంటుంది.

ఏది ఏమైనా హరీశ్ రావు హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గెలిపించి కెసీఆర్ హరీష్ రావుపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటారా లేదా అన్నది చూడాల్సి ఉంది.

ఈరోజు జరిగే గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ లో గెలిచే జట్టు అదే…