ఎల్లారెడ్డిపేట నుండి యాదగిరిగుట్టకు – ఉచిత దైవదర్శనం కల్పిస్తున్న సర్పంచ్ : వెంకట్ రెడ్డి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రం నుండి సుమారు 1500 మందికి 30 ట్రావెల్స్ బస్సులలో ఆదివారం ఎల్లారెడ్డిపేట నుండి తన సొంత ఖర్చులతో యాదాద్రి ఆలయం శ్రీ లక్ష్మీనరసింహస్వామి దర్శన భాగ్యం కల్పిస్తానని ఇంతకుముందు ఎవ్వరూ ఇలాంటి దైవదర్శనాలు కల్పించలేరని తెలంగాణలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వేలకోట్లతో రాతితో నిర్మించిన సప్త గోపురాలు, ఆలయ పురవీధులు, 1200 స్తంభాలు, ఏనుగులతో ముఖద్వారం, బంగారు తాకిడితో ప్రధాన గోపురం, వేలాది మంది కళాకారులచే నిర్మించిన లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోవాలని గ్రామస్తులందరూ సుఖసంతోషాలతో ఉండాలని పాడి పంటలు,పిల్లా చెల్లెలు, సల్లంగా ఉండాలని గత కొద్ది రోజుల క్రితం దుర్గమ్మ,మైసమ్మ పునర్నిర్మాణంలో భాగంగా ఎంతో కొంత తనవంతుగా గ్రామస్తులందరికీ గ్రామదేవతల దర్శనం కల్పించాడు.

అదేవిధంగా ఇప్పుడు నన్ను ఎన్నుకున్న గ్రామ ప్రజలతో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకుంటానని అన్నారు.

అల్పాహారంతో పాటు భోజన సౌకర్యం మంచినీటి సౌకర్యం కూడా కల్పిస్తున్నానని పేర్కొన్నారు.

దైవ దర్శనం కల్పిస్తున్నందుకు సర్పంచ్ వెంకట్ రెడ్డికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ దైవ దర్శన కార్యక్రమానికి వివిధ కుల సంఘాల నాయకులు, ప్రజలు, భక్తులు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న పాలకవర్గంతో పాటు, ఎల్లారెడ్డిపేట మేజర్ గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్, మాజీ వార్డు సభ్యురాలు, బిఆర్ ఎస్ సీనియర్ నాయకురాలు ఒగ్గు లక్ష్మీ యాదవ్,బి ఆర్ ఎస్ పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, మేగి నరసయ్య, బందారపు బాల్ రెడ్డి, బాధ రమేష్, కోల మోహన్,గన్న మల్లారెడ్డి, జవ్వాజి కొమురయ్య, నంది అవార్డు గ్రహీత దుంపెన రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సినిమా మాకు సెట్ కాదు..దర్శకుల ముఖం పైన చెప్పేసిన స్టార్ హీరోలు..?