రేపటి నుండి పదిర గ్రామంలోకి బస్ బస్ పాస్ ప్రారంభం

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District ) ఎల్లారెడ్డిపేట మండలం లోని వెంకటాపూర్ ,హరిదాసునగర్, పదిర,రాగట్లపల్లి , ఎల్లారెడ్డిపేట మీదుగా వీర్నపల్లి మోడల్ స్కూల్ (Model School )కు సిరిసిల్ల ఆర్ టి సి డిపో బస్ నడుస్తుంది.

కానీ ఇప్పటి వరకు విద్యార్థులను మోడల్ స్కూల్ కు బస్ లో వీర్నపల్లి కి తీసుకుపోవడానికి బస్ రాకపోవడంతో ఆ గ్రామం నుండి రెండు ఆటోల ద్వారా విద్యార్థులు చదువుకోవడానికి వెళ్ళేవారు.

గ్రామంలోకి బస్ రాక ఆటోల ద్వారా విద్యార్థులు మోడల్ స్కూల్ కు వెళ్తున్నారన్న విషయం తెలుసుకునీ ఆదివారం సిరిసిల్ల ఆర్టీసీ డిపో ఎస్ టి ఐ సారయ్య ,విలేజ్ బస్ ఆఫీసర్ రాంరెడ్డి నాయక్ లకు పదిర గ్రామంలో నుండి ఎల్లారెడ్డి పేట( Yellareddy Peta ) మీదుగా వీర్నపల్లి వరకు బస్ నడిపించాలని కోరుతూ వారికి ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్ వినతి పత్రం అందజేశారు.

కాగా సోమవారం మోడల్ స్కూల్ కు వెళ్ళే తల్లిదండ్రుల సమక్షంలో సర్పంచ్ కుంబాల వజ్రమ్మ ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా విలేజ్ బస్ ఆఫీసర్ H3 Class=subheader-styleరాంరెడ్డి నాయక్ /h3pమాట్లాడుతూ ప్రతి రోజూ ఉదయం 7.

20 నిమిషాలకు పదిర గ్రామం లోకి వస్తుందని వీర్నపల్లి లో 8.30 గంటలకు చేరుకుంటుందనీ, సాయంత్రం 5.

30 గంటలకు వీర్న పల్లి నుండి 6.10నిమిషాల వరకు పదిర లో ఉంటుందని అన్నారు.

విద్యార్థుల బస్ పాస్ కోసం సర్పంచ్ కుంబాల వజ్రమ్మ 5000 రూపాయలు విరాళంగా విలేజ్ బస్ ఆఫీసర్ రాంరెడ్డి నాయక్,ఎస్.

టి.ఐ సారయ్య కు అందజేశారు.

ఈ కార్యక్రమంలో ఆర్టీసీ అధికారులతో పాటు ఎల్లారెడ్డి పేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్, జవ్వాజి మహేందర్, కమలాకర్, బీజేపి నాయకులు రేపాక రామచంద్ర రెడ్డి తో పాటు మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

డబ్బు లాక్కొని హీరోయిన్ కు చుక్కలు చూపించిన బిచ్చగాడు.. అసలేం జరిగిందంటే?