నేటి నుండి తెలంగాణలో ఒంటి పూట బడి…!
TeluguStop.com

నల్లగొండ జిల్లా:రాష్ట్రంలో ఎండలు తీవ్రమవుతున్న దృష్ట్యా నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహించనున్నట్టు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలిపారు.


ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు తప్పకుండా ఒంటిపూట బడులను నిర్వహించాలని కమిషనర్ ఆదేశించారు.


లేనిపక్షంలో అన్ని రకాల చర్యలు తీసుకొంటామని హెచ్చరించారు.దీనిపై ఇప్పటికే డీఈవోలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు.
ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఒంటిపూట తరగతులు ఉంటాయని వెల్లడించారు.
పాఠశాలల పనిదినాల్లో 12.30 గంటలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తామని స్పష్టంచేశారు.
పదోతరగతి పరీక్షలకు అదనపు తరగతులు నిర్వహించాలని సూచించారు.
రష్మిక వయస్సు అంతనా….అసలు వయస్సు బయట పెట్టిన రష్మిక…పోస్ట్ వైరల్!