వివేకా హత్య జరిన రోజు నుంచే ఒక పధకం ప్రకారం చంద్రబాబు, లోకేష్ ల పై వైసిపి బురద జల్లుతుంది..బోండా ఉమ టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు
TeluguStop.com
వివేకా హత్య జరిగిన రోజు నుంచే ఒక పధకం ప్రకారం చంద్రబాబు, లోకేష్ ల పై వైసిపి బురద జల్లుతుంది.
2019 మార్చిలో ప్రతిపక్ష నేతగా జగన్ సిబిఐ విచారణ చేయాలని కోరారు.సిఎం కాగానే సిబిఐ విచారణ అవసరం లేదని కేసు ఉపసంహరించుకున్నది వాస్తవం కాదా ప్రతిపక్షం లో ఉంటే సిబిఐ కావాలా.
అధికారంలో ఉంటే సిబిఐ విచారణ వద్దా హైకోర్టు నుండి గ్యాగ్ ఆర్డర్ తెచ్చి విచారణ కోరా.
అవినీతి పత్రిక సాక్షిలో నారాసుర రక్తచరిత్ర అని రాసుకున్నాడు .తరువాత నిందితుల పక్షాన నిలిచి కేసును నీరు గార్చారు 161 స్టేట్ మెంట్ చెల్లి సునీత, ఆమె భర్త, జగన్ బంధువులు ఇచ్చారు.
ఈ హత్య చేసింది వాళ్లేనని స్పష్టంగా చెప్పినా వారిని కాపాడటానికి జగన్ ప్రయత్నం చేస్తున్నారు.
కేసు లో అసలు నిజాలను సిబిఐ వెలికి తీస్తుంటే జగన్ అడ్డుకున్నది వాస్తవం కాదా .
దోషుల పేర్లు బయటకు రాగానే.సునీత పైనే ఆరోపణలు చేస్తారా అని తండ్రి ని కోల్పోయిన కుమార్తె కు న్యాయం చేయమంటే తప్పా చంద్రబాబు నడిపిస్తున్నారని మాట్లాడటానికి సిగ్గుందా సాక్షి లో సూత్రధారి అల్లుడే అని రాయించింది జగన్మోహన్ కాదా టిడిపి కి.
ఈ హత్య కేసుతో ఎటువంటి సంబంధాలు లేవు ఎన్నికలకు ముందు ఆడిన డ్రామాలనే ఇప్పుడూ కొనసాగిస్తున్నారు.
సునీతమ్మే హైకోర్టు లో వేసిన పిటీషన్ కారణంగా నేడు అసలు దోషుల పేర్లు బయటకు వచ్చాయి.
సిట్ బృందం దర్యాప్తు ను కూడా నీరుగార్చేలా చేశారు.నిందితులను జగన్ కాపాడుతున్నారని అందరికీ అర్ధమైంది.
సునీతమ్మ అందుకే న్యాయ పోరాటం చేస్తున్నారు.అవినాష్ రెడ్డి, గంగిరెడ్డి, శివశంకర రెడ్డి పేర్లు కూడా సునీత ప్రస్తావించారు.
వివేకా హత్య జరిగే సమయానికి ఎంపి అభ్యర్థులు ప్రకటన కూడా రాలేదు.కడప టిక్కెట్ తనకుగానీ, షర్మిలకు గానీ ఇవ్వాలని వివేకా కోరింది వాస్తవం కాదా ఈ టిక్కెట్ వివాదంలో పెద్దాయన్ని చంపేసి.
నిందలు ఎదుటివాళ్ల మీద వేస్తారా .ఈ కేసు లోవాస్తవాలు వెలుగులోకి రావడంతో తాడేపల్లి పునాదులు కదులుతున్నాయి.
ఆనాడు గౌతమ్ సవాంగ్ చేసినట్లుగా చెబుతున్న వ్యాఖ్యలు నిజం కాదా రెడ్ హ్యాండెడ్ గా దొరికి కూడా బయటకి బొంకుతున్నారు.
నిందితులను కాపాడేందుకు జగన్ ఎందుకు ఇన్ని నాటకాలు ఆడుతున్నాడు ఈ హత్య కేసులో సిబిఐ కి సహకరించి జగన్ నిజాయితీ నిరూపించుకోవాలి.
సిబిఐ అధికారుల పై కేసులు పెట్టి వేధిస్తున్నారు.తమిళనాడు జయలలిత కేసు తరహాలో జగన్ ను కూడా విచారించాలి ఇందుకు ముందుగా జగన్ రాజీనామా చేసి విచారణ కు సహకరించాలి అతి త్వరలోనే ఈ కేసు మిస్టరీ విషయాలు అన్నీ వెలుగులోకి వస్తాయి.
వీడియో వైరల్.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్