ఆ రోజు నుండే సాధారణ భక్తులకు.. బాల రాముడి దర్శన భాగ్యం..!
TeluguStop.com
బాల రామున్ని ( Bala Ramuni )దర్శించుకునేందుకు దేశవ్యాప్తంగా కోట్లాదిమంది భక్తులు వేచి చూస్తున్నారు.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఇటీవల శుభవార్త చెప్పింది.అయితే మంగళవారం నుండి సాధారణ భక్తులకు రాముడు దర్శన భాగ్యం కల్పిస్తున్నట్లు ప్రధాన అర్చకులు ఆచార్య సంతేంద్ర దాస్ తెలిపారు.
అయితే అయోధ్యలో బాలరాముడు దర్శనం అలాగే హారతి వేళల వివరాలను శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరించడం జరిగింది.
అలాగే శ్రీరామ జన్మభూమి తమ వెబ్సైట్ లో కూడా దీని గురించి వెల్లడించింది.
అయితే దర్శన వేళలు ఉదయం 7 గంటల నుండి 11:30 గంటల వరకు మధ్యాహ్నం 2 నుండి రాత్రి 7 గంటల వరకు ఉంటాయని ప్రకటించింది.
"""/" /
ఇక ఉదయం 6:30 గంటలకు జాగరణ హారతికి ఒకరోజు ముందే అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలని తెలిపింది.
ఇక సంధ్య హారతికి రాత్రి 7: 30 గంటలు అదే రోజు బుకింగ్ చేసుకోవాలని తెలిపింది.
ఇక రాముడిని దర్శనం చేసుకోవాలనుకునే భక్తులు తప్పనిసరిగా ఆధార్ కార్డు లేదా మరి ఏదైనా గుర్తింపు పత్రం తీసుకురావాలని, దీంతో హారతి కార్యక్రమానికి ఉచితంగానే పాస్ ఇస్తారని తెలిపింది.
అయితే బాలరాముడు దర్శనం హారతి( Darshanam Aarti Of Balarama ) పాస్ లకు ఆన్లైన్ బుకింగ్ చేసుకునేందుకు భక్తులు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధికారిక వెబ్సైట్ కు వెళ్ళాలి.
ఇక అందులో మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాక ఓటిపి ఎంటర్ చేసి వెరిఫై చేసుకోవాలి.
"""/" / దీంతో రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది.లాగిన్ అయిన తర్వాత మై ప్రొఫైల్ సెక్షన్ లోకి వెళ్లి గుర్తింపు వివరాలు ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత హారతి లేదా దర్శనం టైం స్లాట్లను ఎంచుకొని పాస్ కోసం బుక్ చేసుకోవాలి.
ఇక అయోధ్య రామ మందిర్ ( Ayodhya Ram Mandir )చేరుకోవడానికి దేశంలోని ప్రధాన నగరాల నుండి రైలు, రోడ్డు, వాయు మార్గాలు చాలా అందుబాటులో ఉన్నాయి.
ఇక ఢిల్లీ, లక్నో, వారణాసి, కోల్కత్తా నుండి అయోధ్యకు ప్రత్యేక రైలును కూడా నడిపిస్తున్నారు.
ఇక అక్కడ నుండి అయోధ్య రామ మందిరం వెళ్లడానికి ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి.
కాబట్టి అయోధ్యకు వెళ్లాలనుకున్నవారు ఈ విధంగా అక్కడికి చేరుకోవచ్చు.
అందుకే పవన్ కళ్యాణ్ కు నేను ఓటు వేయలేదు… కోర్టు హీరోయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు!