ఈ జబర్దస్త్ కమెడియన్స్ చదువు గురించి తెలిస్తే షాక్ అవుతారు?
TeluguStop.com
బుల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమెడియన్స్ బుల్లి తెరకు పరిచయం అయ్యారు.
జబర్దస్త్ ద్వారా పరిచయమైన ఈ కమెడియన్స్ ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రస్తుతం వెండితెరపై కూడా అవకాశాలను సంపాదించుకుంటున్నారు.
ఈ విధంగా వరుస అవకాశాలను అందిపుచ్చుకొని కొందరు కమెడియన్స్ నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
ఇలా లక్షలో ఆదాయం పొందుతున్న ఈ కమెడియన్స్ ఎంతవరకు చదువుకున్నారు?ఎవరు ఎక్కువ చదువుకున్నారు ఎవరు మధ్యలోనే చదువు ఆపేసారు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న అనసూయ ప్రస్తుతం బుల్లితెరపై కన్నా, వెండితెరపై ఎక్కువ అవకాశాలను సంపాదించుకుని ఎంతో బిజీగా ఉంది.
ఇక అనసూయ చదువు విషయానికి వస్తే ఈమె ఎంబీఏ పూర్తి చేశారు.అదేవిధంగా ఎక్స్ ట్రా జబర్దస్త్ యాంకర్ గా వ్యవహరిస్తున్నటువంటి రష్మి గౌతమ్ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
ఇక కమెడియన్స్ విషయానికి వస్తే సుడిగాలి సుదీర్ ఇంటర్మీడియట్ పూర్తి చేయగా హైపర్ఆది బిటెక్ పూర్తి చేశారు.
"""/"/
అదిరే అభి బీటెక్ పూర్తి చేశారు.గత కొంత కాలం నుంచి జబర్దస్త్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ ఇమ్మానియేల్ డిగ్రీ పూర్తి చేశారు.
ఇక రాకెట్ రాఘవ డిగ్రీ పూర్తి చేసి టీచర్ ట్రైనింగ్ కూడా తీసుకున్నారు.
రంగస్థలం మహేష్ డిగ్రీ బీకాం పూర్తి చేశారు.అదుర్స్ ఆనంద్ ఎంసీఏ డిస్ కంటిన్యూ.
ఇకపోతే ముక్కు అవినాష్ ఎంబీఏ పూర్తి చేశారు.కెవ్వుకార్తిక్ డిగ్రీ పూర్తి చేయగా, గెటప్ శీను ఇంటర్మీడియట్ డిస్ కంటిన్యూ, ఇక ఆటో రాంప్రసాద్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు చదువుకున్నారు.
"""/"/
చలాకి చంటి డిగ్రీ డిస్కంటిన్యూ చేయగా, చమ్మక్ చంద్ర ఇంటర్మీడియట్ చదువుకున్నారు.
ఎన్నో సినిమాలలో తాగుబోతు పాత్రలో ఎంతో అద్భుతంగా నటించిన తాగుబోతు రమేష్ ఓన్లీ స్కూల్ స్టడీస్ మాత్రమే పూర్తి చేశారు.
బుల్లెట్ భాస్కర్ బీకాం పూర్తి చేయగా, నాటి నరేష్ డిగ్రీ డిస్ కంటిన్యూ చేశారు.
ఇలా జబర్దస్త్ కమెడియన్ లు కేవలం కొందరు మాత్రమే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినప్పటికీ మిగిలిన వారందరూ కూడా వారి చదువులను మధ్యలో ఆపి ఇలా కమెడియన్స్ గా స్థిరపడి నెలకు లక్షల్లో సంపాదిస్తున్నారు.
వైరల్ వీడియో: ఇలా కూడా కారు టైరును మార్చవచ్చా?