ఇకనుండి ‘కూ’ యాప్ కూడా చాట్ జిపిటీని అలా ఉపయోగించుకోనుంది!
TeluguStop.com
ఇప్పుడు ఇంటర్నెట్ ప్రపంచంలో ఎక్కడ విన్నా ఒక్క పేరే వినబడుతోంది.అదే చాట్ జీపీటీ( ChatGPT ).
అవును, ఈ టెక్నాలజీ వచ్చిన ఆనతిలంలోనే జనాల మనసులను ఎంతగానో చూరగొంది.టెక్నాలజీ రంగంలో ఓ సంచలనంగా మారింది అని చెప్పుకోవచ్చు.
ప్రస్తుతం ప్రపంచమంతా ఈ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.అయితే కొంతమంది దీనిపైన విమర్శలు కూడా చేస్తున్నారు.
ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే.ఎన్ని లాభాలున్నాయో? అంతకు మించి అనార్థాలు జరుగుతాయని భయపెడుతున్నారు.
అది వేరే విషయం. """/" /
ఇకపోతే భారతదేశం యొక్క మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ ( Microblogging Platform )అయినటువంటి కూ యాప్ టెక్నాలజీ రంగంలో కీలక పరిణామానికి తెర లేపిన సంగతి విదితమే.
అయితే ఇక నుంచి కూ యాప్ సృష్టికర్తలు చాట్ జీపీటీ ద్వారా పోస్ట్‌లను చేయవచ్చని, దానికోసం చాట్ జీపీటీ అనుసంధానంతో కొత్త ఫీచర్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఈ ఫీచర్ కూ యాప్( Koo App )లో ధృవీకరించబడిన ప్రొఫైల్‌ల కోసం అందుబాటులో ఉంచబడింది.
త్వరలో వినియోగదారులందరికీ అందుబాటులోకి దీనిని తీసుకురాబడుతుంది. """/" /
ఇకపోతే కూ యాప్ లో చాట్ జీపీటీని జోడించడం ద్వారా.
వినియోగదారులు తమకు పోస్ట్‌లను సిద్ధం చేయడంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సామర్థ్యాలను ఉపయోగించుకోవచ్చని అంటోంది.
ఈ ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్ ఫీచర్ క్రియేటర్‌లకు ఎంతగానో ఉపయోగపడనుంది.అవును, ఇకనుండి కూ యాప్‌లో చాట్ జీపీటీని ఉపయోగించి క్రియేటర్‌లు వారి సందేశం లేదా ప్రశ్నను చాలా తేలికగా అడగవచ్చు లేదా టైప్ చేయవచ్చు.
అదికూడా కాదంటే వారి వాయిస్‌తో కూ యాప్ యొక్క వాయిస్ కమాండ్ ఫీచర్‌ను తేలికగా ఉపయోగించవచ్చు.
మామకు తోడుగా నిలిచిన కోడలు పిల్ల…. పిఠాపురం కోసం ఉపాసన సంచలన నిర్ణయం?