ఇక‌పై ప‌వ‌నే అన్నీ.. నాదెండ్ల అంత‌వ‌ర‌కే..!

ఏపీలోని జ‌న‌సేన‌లో ప‌వ‌న్ త‌ర్వాత ఎవ‌రైనా బ‌ల‌మైన నేత ఉన్నారంటే అది నాదెండ్ల మ‌నోహ‌రే.

గ‌తంలో జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ ఉన్న‌ప్పటికీ ఆయ‌న రాజీనామా చేసి వెళ్లిపోయారు.ఇక ప్ర‌స్తుతం జ‌న‌సేన‌లో చెప్పుకోద‌గ్గ బ‌ల‌మైన నేత ఎవ‌రూ లేర‌నే చెప్పాలి.

ప్ర‌స్తుతం జ‌న‌సేన‌కు ఆద‌రణ పెరుగుతున్న స‌మయంలో జ‌న‌సేన అధినేత పార్టీని ప‌టిష్టం చేసుకునే ప్ర‌య‌త్నం చేయాలి.

నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌ల‌మైన నేత‌ల‌ను చేర్చుకుంటేనే కొంత ఊపు వ‌స్తుంది.అభ్య‌ర్థులు లేని జ‌న‌సేన ఆ దిశ‌గా అడుగులు వేయాల‌ని రాజ‌కీయ పండితులు అంటున్నారు.

అయితే చాలా మంది చేరిక‌కు విముఖ‌త‌గా ఉన్నా ఓ నేత అడ్డుకుంటున్నాడ‌నే వాద‌న వినిపిస్తోంది.

అయితే అనేక కారణాలు.అవరోధాలు ఉన్నాయని ఆ పార్టీ నేతలే చెప్పుకుంటున్నారు.

ఇక తాజాగా గోదావరి జిల్లాలకు చెందిన బొలిశెట్టి శ్రీనివాస్ బహిరంగంగానే నాదెండ్ల మీద విమర్శలు చేశారు.

జనసేనలో ఎవరూ చేరకుండా నాదెండ్ల మ‌నోహ‌ర్ అడ్డుకుంటున్నాడ‌ని ఆరోపించారు.ఈ రోజుకీ చాలా మంది జనసేనలో చేరాలని ఉత్సాహం చూపిస్తున్నార‌ని కానీ.

అవ‌రోధాల వ‌ల్ల చేర‌లేక‌పోతున్నార‌ని అన్నారు.అంతేకాకుండా ఇప్ప‌టి వ‌ర‌కు జ‌న‌సేన‌ను వీడిన సీనియర్లు కూడా అటు పవన్ కి ఇటు పార్టీకి మధ్య అడ్డుగోడలా మారార‌ని అన‌డం తెలిసిందే.

అయితే నాడు పెద్దగా పట్టించుకోని పవన్ ప్ర‌స్తుతం ఈ వ్య‌వ‌హారంపై దృష్టిపెట్టాడ‌ని అంటున్నారు.

ఈ నేప‌థ్యంలోనే నాదెండ్లని కాస్తా తగ్గించారని అంటున్నారు.ఆయనకు కేవలం పవన్ పర్యటన బాధ్యతలను మాత్రమే అప్పగించిన‌ట్లు టాక్ వినిపిస్తోంది.

"""/"/ అయితే నాదెండ్ల జనసేన పార్టీలో రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ గా ఉంటున్నారు.

కానీ ఇపుడు పవన్ టూర్ల షెడ్యూల్ చూసుకోవడానికే ప‌రిమితం చేశార‌ట‌.ఇక పార్టీ వ్య‌వ‌హారాలు చూసే మ‌రో నేత లేక‌పోవ‌డంతో ప‌వ‌నే అన్ని చూసుకుంటార‌ట‌.

అలాగే పార్టీలో బ‌ల‌మైన నేత‌ల‌ను తీసుకువ‌చ్చేలా చేరిక‌ల‌కు ఆహ్వానం పంపుతున్నార‌ట‌.అయితే ఇది ఒక మంచి ప‌రిణామంగానే భావిస్తున్నారు.

ఇక పార్టీలో బ‌ల‌మైన నేత‌లు చేర‌డ‌మే త‌రువాయి.నియోజ‌క‌వ‌ర్గాల వారీగా బ‌డా నేత‌లు పార్టీలోకి వ‌స్తే జ‌నాల్లో కూడా పార్టీ బ‌లంగా వ‌స్తుంద‌ని అంటున్నారు.

మొత్తానికి ఈ ఈ నిర్ణ‌యాల‌తో మ‌రింత క‌లిసి వ‌చ్చేలా ఉంది.ఇప్పుడు చేరిక‌లు ఊపందుకుంటే ఇన్ని రోజులు రాక‌పోవ‌డానికి నాదెండ్లే కార‌ణ‌మ‌ని చెప్ప‌వ‌చ్చు.

అలా కాకుండా చేరిక‌లు సంతృప్తిగా లేక‌పోతే మాత్రం పార్టీ మీద ఆసక్తి లేకనే అన్న అనుమానాలు వ్య‌క్తం అవుతాయి.