ఇలాంటప్పుడు బుధుడు కుంభరాశిలోకి వెళ్ళినప్పుడు కుంభరాశిలో సూర్యుడు, బుధుడు కలిసి ఉండటం వల్ల బుద్ధాదిత్య రాజయోగం ఏర్పడుతుంది.
బుధుడు మార్చి 16 వరకు కుంభరాశిలో ఉండి ఆ తర్వాత మినరాశిలోకి వెళ్తాడు.
జ్యోతిష్య శాస్త్రంలో బుధుడు ప్రసంగం, కమ్యూనికేషన్, తెలివితేటలకు కారకంగా పరిగణించబడతాడు.అలాంటి బుధుడు ఒక రాశిని బదిలీ చేసినప్పుడు దాని ప్రభావం ఈ రాశుల పై కనిపిస్తుంది.
ఆ రాశులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.కర్కాటక రాశి కి ఎనిమిదవ ఇంటికి బుధుడు వచ్చాడు.
దీని కారణంగా ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసే అవకాశం ఎక్కువగా ఉంది.
వ్యాపారంలో విజయం సాధించాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది. """/" /
దంపతుల మధ్య విభేదాలు రావచ్చు.
పెట్టుబడులను నష్టపోయే అవకాశం ఉన్నందున వాటికి దూరంగా ఉండడమే మంచిది.కన్యా రాశి లో ఆరువ ఇంటిలో బుధుడు సంచరిస్తాడు.
దీంతో కన్యారాశి వారు ఈ కాలంలో వారి జీవితంలో అనేక సమస్యలను ఎదుర్కొంటారు.
ఈ రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండడమే మంచిది. """/" /
మీన రాశి వారికి బుధుడు 12వ ఇంట్లో ఉంటాడు.
దీని కారణంగా ఈ కాలంలో అకస్మాత్తుగా ఖర్చులు పెరుగుతాయి.ఈ రాశి వారు విలాసాల కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు.
ఈ రాశి వారు ఈ సమయంలో పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది.కుటుంబ విషయాల్లో ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోవడమే మంచిది.
వైరల్ వీడియో: ఆ కుక్కను ముద్దు చేశాడని.. వాచ్‌మెన్‌పై అసూయతో దాడిచేసిన మరో కుక్క!