జూలై 15 నుంచి బీసీ కులవృత్తులకు లక్ష సహయం పంపిణీ

జూలై మాసంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 300 మంది బీసీలకు చెక్కుల పంపిణీ.

రాజన్న సిరిసిల్ల జిల్లా :ఈ నెల 15 నుంచి బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చెక్కుల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ ( Gangula Kamalakar )పేర్కొన్నారు.

మంత్రి బీసీ( B.C ) కుల వృత్తులు, చేతి వృత్తుల వారికి ఆర్థిక సహాయం పథకం అమలుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ బీసీ కులవృత్తులు, చేతి వృత్తులను సంరక్షించేందుకు, కుల వృత్తులు పూర్వవైభవం తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు.

కుల వృత్తులు చేతివృత్తులు చేసుకునే వారికి ప్రోత్సాహం అందిస్తే ఎదుగుతారనే ఉద్దేశంతో లక్ష రూపాయలు ఆర్థిక సహాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని పేర్కొన్నారు.

జూన్ 20 వరకు బీసీ కుల వృత్తులకు ఆర్థిక సహాయం కోసం రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల 28 వేల దరఖాస్తులు స్వీకరించామని, వీటిలో నుంచి అర్హులైన ప్రతి లబ్దిదారుడికి సహాయం అందే వరకు ఈ పథకం కొనసాగుతుందని మంత్రి స్పష్టం చేశారు.

జూలై మాసంలో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 300 మందికి జూలై 15 నుంచి లక్ష రూపాయలు చెక్కులను జిల్లా మంత్రులు, ఎమ్మెల్యే సమక్షంలో పంపిణీ చేయాలని మంత్రి సూచించారు.

తప్పుడు ప్రచారాలు పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అన్నారు.బీసి కులవృత్తుల ఆర్థిక సహాయం పథకం నిరంతర ప్రక్రియగా కొనసాగుతోందని, దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వారందరికి దశల వారీగా పథకం అమలవుతుందని, ప్రతి చివరి లబ్దిదారుడికి సహాయం అందే వరకు ప్రతి నెలా చెక్కుల పంపిణీ ఉంటుందని తెలిపారు.

ప్రభుత్వ సహాయం అందుకున్న లబ్దిదారుల వారికి నచ్చిన చోట అవసరమైన పరికరాలు కొనుగోలు చేసి కులవృత్తి చేసుకోవచ్చని, నెల రోజుల లోపు అధికారులు సదరు లబ్దిదారుని యూనిట్ వివరాలు ఆన్ లైన్ లో నమోదు చేయాలని మంత్రి తెలిపారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి.

సత్య ప్రసాద్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!