పంచాయతీల్లోనూ ... పట్టు పెంచుకుంటున్న 'కారు'

టీఆర్ఎస్ పార్టీ తెలంగాణాలో తమకు ఎదురే లేదన్న సంగతి మరోసారి నిరూపించుకుంటోంది.ఇప్పటికే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసిన ఆ పార్టీ ఇప్పుడు పంచాయతీ ఎన్నికల్లోనూ తమ సత్తా చాటుతోంది.

మొదటివిడతగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో.అత్యధిక గ్రామ పంచాయతీలను కైవసం చేసుకుంది.

900 గ్రామ పంచాయతీల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థులే గెలిచారు. Style="margin:auto;width: 80%;text-align:center;margin-bottom: 10px;""/"/ 150కి పైగా గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ బలపర్చిన అభ్యర్థులు విజయం సాధించారు.

తెలంగాణలో మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతోంది.మధ్యాహ్నం రెండు గంటలకు కౌంటింగ్ ప్రారంభమైంది.

2019, జనవరి 21 సోమవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటవరకు సాగింది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు కౌంటింగ్ జరిగింది.

పవన్ కోసం ఏపీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటా అంటున్న సీనియర్ హీరోయిన్ ఖుష్బు..!!