తమ స్నేహితుడి కుమారుడిని బ్రతికించుకునేందుకు గొప్ప మనసు చాటుకున్న పూర్వ విద్యార్థులు

రాజన్న సిరిసిల్ల జిల్లా ( Rajanna Sirisilla District )తమ చిన్ననాటి స్నేహితుడి కుమారుడీ గుండెకు రెండు రంధ్రాలు పడి చావు బ్రతుకులతో కొట్టుమిట్టాడుతుండడంతో పూర్వ విద్యార్థులు కలిసికట్టుగా తల కొంత పోగుచేసి ₹ 52,516 రూపాయలు భాదిత కుటుంబానికి అందించి గ్రామస్తుల ప్రశంసలు అందుకున్నారు.

వేములవాడ గ్రామీణ మండలం హన్మాజీపేట( Hanmajipeta )గ్రామానికి చెందిన సుర మహేష్ జ్యోతి దంపతులకు మూడు నెలల క్రితం కుమారుడు రియాన్ జన్మించాడు.

అయితే వారి కుమారుడు గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఉండటంతో ఆసుపత్రిలో చూపించారు.

డాక్టర్లు రియాన్ గుండెకు రెండు హోల్స్ ఉన్నాయని ఆపరేషన్ చేయవలసి ఉంటుందని దానికి లక్షల్లో ఖర్చు అవుతుందని చెప్పడంతో భాదిత నిరుపేద కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడిపోయారు.

అయితే గ్రామానికి చెందిన 2005- 06 మహేష్ చిన్ననాటి పూర్వ విద్యార్థులు బుధవారం ఆపరేషన్( Heart Surgery ) నిమిత్తం ఆర్థిక సహాయం అందించి గొప్ప మానవత్వాన్ని చాటుకున్నారు.

రియాన్ ఆపరేషన్ నిమిత్తం మరికొంత డబ్బు అవసరం ఉంటుందని చిన్నారి ఆపరేషన్ కు ఆర్థిక సహాయం అందించాలని దయార్ధ హృదయంతో వేడుకుంటున్నారు.

ఈ కార్యక్రమంలో ఆడెపు విజయ్, మర్రిపల్లి పరశురాం, వేణు, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.

వైరల్ వీడియో: పెన్సిల్ మొనపై చిన్ని కృష్ణుడిని భలే చేసాడుగా..